Tuesday, November 26, 2024

Breaking: సన్​రైజర్స్​ తడబాటు​.. 16 ఓవర్లలో 101/5

కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తడబడుతోంది. 178 ప‌రుగుల టార్గెట్‌ని ఛేదించ‌డంలో స‌న్‌రైజ‌ర్స్ చెమ‌టోడుస్తున్నారు. జిడ్డు ఆట ఆడుతున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ (9) పెవిలియన్ చేరాడు. ఆఫ్ స్టంప్ మీదకు రస్సెల్ వేసిన బంతిని ఫైన్ లెగ్ మీదకు ఆడటానికి విలియమ్సన్ ప్రయత్నించాడు. కానీ బంతిని మిస్ అవడంతో అది ఆఫ్‌స్టంప్‌ను కూల్చింది. దీంతో విలియమ్సన్ ఇన్నింగ్స్ ముగిసింది. కేవలం 30 పరుగులకే సన్‌రైజర్స్ తొలి వికెట్ కోల్పోయింది. విలియమ్సన్ అవుటవడంతో యువ ఆటగాడు రాహుల్ త్రిపాఠీ క్రీజులోకి వచ్చాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మంచి ఇన్నింగ్స్ ఆడటంతో సన్‌రైజర్స్ జట్టు పవర్‌ప్లే ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 31 పరుగులు చేసింది.

ఇక‌.. ఫామ్‌లో ఉన్న రాహుల్ త్రిపాఠీ (9) కూడా సరిగా రాణించలేదు. సౌథీ వేసిన 9వ ఓవర్ రెండో బంతికే పెవిలియన్ చేరాడు. సౌథీ వేసిన బంతిని త్రిపాఠీ.. నేరుగా బలంగా బాదాడు. అయితే వెంటనే స్పందించిన సౌథీ.. తనపైకి వచ్చిన బంతిని రెండు చేతులతో అందుకున్నాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌తో త్రిపాఠీ ఇన్నింగ్స్ ముగిసింది. సన్‌రైజర్స్ జట్టు 54 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఇక.. అభిషేక్​ శర్మ (43), మార్క్రం (32), నికోలస్​ పూరన్​ (2) పరుగులు చేసి పెవిలియన్​ చేరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement