Friday, November 22, 2024

IPL : ఫైన‌ల్ బెర్త్ కు చేరేది ఎవ‌రు… అమీ తుమీ తేల్చుకోనున్న స‌న్ రైజ‌ర్స్, ఆర్ఆర్

ఆసక్తి కరంగా సాగుతున్న ఇండియన్‌ ప్రీమి యర్‌ లీగ్‌ 17వ సీజన్‌ చివరి అంకానికి చేరుకుంది. ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఫైనల్‌ బెర్త్‌ సొంతం చేసుకుంది. కోల్‌కతాతో ఫైనల్‌ ఆడేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. నేడు ఇరు జట్ల మధ్య చెన్నై వేదికగా రెండో క్వాలిఫయర్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇందులో గెలిచే జట్టు ఆదివారం చెన్నైలో జరిగే తుది పోరుకు అర్హత సాధిస్తుంది. ఫైనల్లో కేకేఆర్‌తో ఐపీఎల్‌ ట్రోఫీ కోసం పోటీ పడుతుంది.

రాజస్తాన్‌ రాయల్స్‌ ఎలిమినేటర్‌లో ఆర్సీబీపై విజ యం సాధించి రెండో క్వాలిఫయర్‌లో అడుగు పెట్టింది. మరోవైపు క్వాలిఫైయర్‌-1లో కోల్‌కతా చేతిలో కంగుతిన్న సన్‌రైజర్స్‌ ఇప్పుడు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. లీగ్‌ దశలో దూకుడుగా ఆడిన సన్‌రైజర్స్‌ ప్లే ఆఫ్స్‌లో మాత్రం నిరాశ పరిచింది. ఇప్పుడు టైటిల్‌ గెలవా లంటే ముందు రాజస్తాన్‌ను.. తర్వాత కేకేఆర్‌ ను ఓడించాలి. ఈ సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన ఎస్‌ఆర్‌హెచ్‌కు గత మ్యాచ్‌లో నిరాశే మిగిలింది. కీలక బ్యాటర్లు పూర్తిగా తేలిపోవడంతో ఆరెంజ్‌ ఆర్మీకి ఓటమి తప్పలేదు.

- Advertisement -

ఓపెన‌ర్లే కీల‌కం ..
ప్రస్తుత సీజన్‌లో సన్‌రైజర్స్‌ ఫ్లే ఆఫ్స్‌కు చేరడంలో ఓపెనర్లు ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ కీలక పాత్రలు పోషించారు. ఇప్పుడు సన్‌రైజర్స్‌ తుది పోరుకు అర్హత సాధించాలన్న వీరు తప్పక రాణించాల్సిందే. ఈ ఎడిషన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో సత్తా చాటిన హెడ్‌ 533 పరుగులతో టోర్నీ టాప్‌ స్కోరర్ల జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు అభిషేక్‌ కూడా 470 పరుగులతో సత్తా చాటాడు. వీరిద్దరూ పవర్‌ ప్లేలో ఏకంగా 125 పరుగులు బాదేసి చరిత్ర సృష్టించారు. మరో మ్యాచ్‌లోనూ వందకు పైగా పరుగులు సాధించి సంచ లనం సృష్టించారు. ఇక కీలకమైన క్వాలి యర్‌- 2లోనూ అదే జోరు కొనసాగించి తమ జట్టుకు అండ గా నిలవాలని ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు కోరుకుం టున్నారు. వీరిద్దరితో పాటు హెన్రిచ్‌ క్లాసెన్‌ కూడా చిరస్మరణీయ ప్రదర్శనలు చేస్తున్నాడు. మిడిల్‌ ఆర్డర్‌లో వచ్చి మెరుగైన స్ట్రయిక్‌ రేట్‌తో జట్టును ఆదుకుంటున్నాడు. ఇతడు పిచ్‌పై ఉన్నంతసేపు ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు కనిపించడం ఖాయమే.

మరోవైపు ఆంధ్ర కుర్రోడు నితీష్‌ కుమార్‌ రెడ్డి కూడా ధాటి గా ఆడుతున్నాడు. చివరి మ్యాచ్‌లో హాఫ్‌ సెంచ రీతో రాణించిన రాహుల్‌ త్రిపాఠి కూడా ఇప్పు డు ఎస్‌ఆర్‌హెచ్‌లో కీలకంగా మారాడు. మరోవైపు అబ్దుల్‌ సమద్‌, షాబాజ్‌ అహ్మద్‌, కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ కూడా చెలరేగి ఆడుతుండటం సన్‌రైజర్స్‌కు కలిసొ చ్చే అంశం. ఈసారి కూడా అందరూ కలిసికట్టుగా రాణిస్తే.. భారీ పరుగులు నమోదవడం ఖాయం. బౌలింగ్‌లోనూ భువనేశ్వర్‌ కుమార్‌, పాట్‌ కమిన్స్‌, భువనేశ్వర్‌ పేస్‌ విభాగాన్ని అద్భుతంగా నడిపిసు ్తన్నారు. పార్ట్‌టైమ్‌ పేసర్‌గా ఉన్న నితీష్‌ కుమార్‌ కూ డా కీలక సమయంలో రాణి స్తూ జట్టుకు అండగా ఉం టున్నాడు. ఇక స్పిన్నర్ల విష యంలో హైదరాబాద్‌ చాలా వీక్‌గా ఉంది. షాబాజ్‌, మయాంక్‌ మార్ఖండే ఆశించిన ప్రదర్శను చేయలేక పోతున్నారు. స్పిన్‌కు అనుకులించే చెన్నై పిచ్‌పై హైదరాబాద్‌ ఆటగాళ్లు ఎలా ప్రదర్శన చేస్తారో చూడాలి.

అశ్విన్ , చాహ‌ల్ కీల‌కం
స్పిన్‌కు అనుకులించే చెపాక్‌ పిచ్‌పై రాజస్తాన్‌ స్పిన్నర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌, యాజువేంద్ర చాహల్‌ విజృంభిం చేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఇప్పటివ రకూ 27 వికెట్లు తీశారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్ల జోరును అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నా రు. అలాగే పేస్‌ విభాగంలో అవేష్‌ ఖాన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, సందీప్‌ శర్మలు రాణిస్తున్నారు. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ సంజూ శాంసన్‌తో పాటు రియాన్‌ పరాగ్‌లు చెలరేగి ఆడుతుంటే.. ధ్రువ్‌ జురేల్‌, యశస్వి జైస్వాల్‌, కోహ్లెర్‌, పావెల్‌ అప్పుడ ప్పుడు బ్యాట్‌ ఝుళిపి స్తున్నారు. వీరిందరూ కలిసి కట్టుగా రాణిస్తే రాజ స్తాన్‌ కూడా భారీ స్కోరు చేయడం ఖాయం. మొత్తంగా ఇరుజట్లు ఉత్సహంతో, ఆత్మవిశ్వా సంతో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగబోతు న్నారు.

హైద‌రాబాద్ దే పై చేయి
ఐపీఎల్‌లో రాజస్తాన్‌పై హైదరాబాద్‌దే పైచేయి. ఇరుజట్లు ఇప్పటివరకు ముఖాముఖిగా 19 మ్యాచు ల్లో తలపడగా.. అందులో సన్‌రైజర్స్‌ 10 సార్లు విజయం సాధించింది. మరరోవైపు రాజస్తాన్‌ రాయల్స్‌ 9 మ్యాచుల్లో నెగ్గింది. ఈ సీజన్‌లో వీరిద్దరి మధ్య జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ చివరి బంతికి ఒక్క పరుగు తేడాతో గెలిచింది.

ఆర్ ఆర్ ప్లేయ‌ర్స్ ఆరోగ్య స‌మ‌స్య‌లు

మరోవైపు రాజస్తాన్ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ సహా కొందరు ఆటగాళ్లు స్వల్ప అనారోగ్యంతో బాధపడుతుండటం ఆ జట్టు యాజమాన్యాన్ని కలవరపెడుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ గెలిచిన అనంతరం శాంసన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. తాను 100 శాతం ఫిట్ గా లేనని.. దగ్గుతో బాధపడుతున్నానని పేర్కొన్నాడు. మరికొందరు ఆటగాళ్లు సైతం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపాడు. అయితే క్వాలిఫయర్ 2కు ముందు తమకు ఒక రోజు విశ్రాంతి లభిస్తున్నందున తామంతా కోలుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు.

మ్యాచ్ కు వ‌రుణ గండం.

ఈ మ్యాచ్ రోజున వర్షం కురిసే అవకాశం ఉండటం ఇరు జట్ల అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. వచ్చే 48 గంటలపాటు చెన్నైలో తేలికపాటి వర్షం కురవొచ్చని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. కానీ కొన్ని గంటలపాటు వర్షం ఏకధాటిగా కురిస్తేనే మ్యాచ్ ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ అలా జరిగినా ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే ఉంది. అంటే శుక్రవారం ఒకవేళ భారీ వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే శనివారం తిరిగి నిర్వహించనున్నారు. ఒకవేళ అనూహ్యంగా శనివారం కూడా భారీ వర్షం కురిసి మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే పాయింట్ల పట్టికలో ముందున్న జట్టు ఫైనల్ కు అర్హత సాధించనుంది. ఈ లెక్కన సన్ రైజర్స్ సులువుగా ఫైనల్ చేరుతుంది. లీగ్ స్టేజ్ లో ఇరు జట్లకు 17 పాయింట్ల చొప్పున లభించినప్పటికీ రాజస్థాన్ తో పోలిస్తే మెరుగైన రన్ రేట్ వల్ల సన్ రైజర్స్ రెండో స్థానంలో నిలవడమే ఇందుకు కారణం.

జట్ల వివరాలు (అంచనా):
సన్‌రైజర్స్‌: ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ, రాహుల్‌ త్రిపాఠి, నితీష్‌ కుమార్‌ రెడ్డి, హెన్రిచ్‌ క్లాసెన్‌ (వికెట్‌ కీపర్‌), అబ్దుల్‌ సమద్‌, షాబాజ్‌ అహ్మద్‌, పాట్‌ కమిన్స్‌ (కెప్టెన్‌), భువనేశ్వర్‌ కమార్‌, నటరాజన్‌, విజయకాంత్‌..
రాజస్తాన్‌: యశస్వి జైస్వాల్‌, టామ్‌ కోహ్లెర్‌, సంజూ శాంసన్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), రియాన్‌ పరాగ్‌, ధ్రువ్‌ జురేల్‌, రోవ్‌మన్‌ పావెల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, అవేశ్‌ ఖాన్‌, సందీప్‌ శర్మ, యాజువేంద్ర చాహల్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement