ఐపీఎల్-16లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మరో ఓటమి ఎదురైంది. తప్పక గెలవాల్సిన కీలక పోరులో మార్‌క్రమ్ సేన చేతులేత్తేసింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో ప్లేఆఫ్స్ రేసు నుంచి హైదరాబాద్ దాదాపుగా నిష్క్రమించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది.
లక్ష్యఛేదనకు దిగిన లక్నో 19.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ప్రేరక్ మన్కడ్ (64 నాటౌట్: 45 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకంతో రాణించగా, చివర్లో నికోలస్ పూరన్ (44నాటౌట్: 13 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసం స్సష్టించాడు. స్టొయినిస్ (40: 25 బంతుల్లో) దూకుడుగా ఆడాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో అభిషేక్ శర్మ, ఫిలిప్స్, మయాంక్ మార్కండే తలో వికెట్ పడగొట్టారు. లక్నో విజయానికి కృషిచేసిన ప్రేరక్ మన్కడ్‌కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కింది.
పూరన్ విన్నింగ్ సైరన్
15 ఓవర్ల సమయానికి లక్నోస్కోరు 114/2. మ్యాచ్ గెలవాలంటే చివరి ఐదు ఓవర్లలో 69 పరుగులు చేయాలి. ఇది ఒకింత కష్టసాధ్యమే. మరోవైపు హైదరాబాద్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తున్నారు. సన్ రైజర్స్ గెలుపు లాంఛనమే అనుకుంటున్న వేళ, నికోలస్ పూరన్ అంచనాల్ని తారుమారు చేశాడు. అభిషేక్ శర్మ వేసిన 16 ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాది స్టాయినిస్ ఔటయ్యాడు. క్రీజ్‌లోకి వచ్చిన నికోలస్ పూరన్ వచ్చి రావడంతోనే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. వరుసగా మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. నటరాజన్ వేసిన 17వ ఓవర్లో ప్రేరక్ మక్కడ్ వరుసగా 6, 4 బాదాడు. భువనేశ్వర్ వేసిన 18వ ఓవర్లో చివరి రెండు బంతులను పూరన్ బౌండరీకి పంపడంతో లక్నో గెలుపు సమీకరణం 12 బంతుల్లో 14గా మారింది. 19 ఓవర్లో పూరన్ సిక్స్‌తో సహా 10 పరుగులు రాబట్టాడు. ఫారూఖి వేసిన చివరి ఓవర్‌లో రెండో బంతికి పూరన్ ఫోర్ బాది జట్టుకు విజయాన్ని అందించాడు. మొత్తంగా 13 బంతులు ఎదుర్కొన్న పూరన్ నాలుగు సిక్సులు, మూడు ఫోర్ల సహాయంతో 44 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ప్లే ఆఫ్ అశలు నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ విఫలమైంది. ప్రత్యర్థి ఎదుట భారీస్కోరు ఉంచడంలో అంచనాల్ని తప్పిందిి. ##హన్రిచ్ క్లాసెన్ (47: 29 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), అన్మోల్‌ప్రీత్ సింగ్ (36: 27 బంతుల్లో 7 ఫోర్లు), అబ్దుల్ సమద్ (37: 25 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు రాణించారు. గ్లెన్ ఫిలిప్స్ (0), అభిషేక్ శర్మ (7) నిరాశపర్చగా, రా#హుల్ త్రిపాఠి (20), మార్‌క్రమ్ (28) పరుగులు చేశారు. లఖ్‌నవూ బౌలర్లలో క్రునాల్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టగా, యుధ్విర్ సింగ్, అవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్, అమిత్ మిశ్రా ఒక్కో వికెట్ తీశారు.
స్కోరుబోర్డు:
సన్‌రైజర్స్ హైదరాబాద్: అన్మోల్‌ప్రీత్ సింగ్ (సి) (బి) మిశ్రా 36, అభిషేక్ శర్మ (సి) డికాక్ (బి) యుధ్విర్‌సింగ్ 7, త్రిపాఠి (సి) డికాక్ (బి) యాశ్ ఠాకూర్ 20, మార్‌క్రమ్ (స్టంప్) డికాక్ (బి) క్రునాల్ పాండ్యా 28, క్లాసీన్ (సి) ప్రేరక్ మన్కడ్ (బి) అవేశ్‌ఖాన్ 47, గ్లెన్ ఫిలిప్స్ (బి) క్రునాల్ పాండ్యా 0, అబ్దుల్ సమద్ (నాటౌట్) 37, భువనేశ్వర్ (నాటౌట్) 2. ఎక్స్‌ట్రాలు 5. (మొత్తం 20 ఓవర్లలో 182/6)
వికెట్లపతనం: 19-1, 56-2, 82-3, 115-4, 115-5, 173-6.
బౌలింగ్: యుధ్విర్‌సింగ్ 3-0-24-1, మేయర్స్ 1-0-11-0, క్రునాల్ 4-0-24-2, అవేశ్‌ఖాన్ 2-0-30-1, యాశ్‌ఠాకూర్ 4-028-1, అమిత్‌మిశ్రా 4-0-40-1, బిష్ణోయ్ 2-0-23-0.
లక్నో జెయింట్స్: కైల్ మేయర్స్ (సి) మార్‌క్రమ్ (బి) గ్లెన్‌ఫిలిప్స్ 2, డికాక్ (సి) అభిషేక్ శర్మ (బి) మార్కండే 29, ప్రేరక్ మాన్కడ్ (నాటౌట్) 64, స్టొయినిస్ (సి) అబ్దుల్ సమద్ (బి) అభిషేక్ 40, పూరన్ (నాటౌట్) 44. ఎక్స్‌ట్రాలు 6. (మొత్తం 19.2 ఓవర్లలో 185/3)
వికెట్ల పతనం: 12–1, 54-2, 127-3.
బౌలింగ్: భువీ 4-0-30-0, ఫరూఖి 3.2-0-32-0, ఫిలిప్స్ 2-0-10-1, నటరాజన్ 4-0-31-0, మార్కండే 3-0-39-1, అభిషేక్‌శర్మ 3-0-42-1