ఐపీఎల్ 2024 సీజన్ తుది దశకు చేరింది. 62 మ్యాచ్‌లు ముగిసే సరికి ప్లే ఆఫ్స్ సమరం రసవత్తరంగా మారింది. ఇప్పటి వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మినహా మరే జట్టు అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు అర్హతసాధించలేదు. రాజస్థాన్ రాయల్స్ అడుగు దూరంలో నిలవగా.. సీఎస్‌కే, సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్‌సీబీ, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ఆదివారం జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్‌పై సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఆర్‌సీబీ విజయాలు సాధించి తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపరుచుకున్నాయి.
62 మ్యాచ్‌లు ముగిసే సరికి కేకేఆర్ టేబుల్ టాపర్‌గా నిలవగా.. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా టాప్-4లో కొనసాగుతున్నాయి. ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటికే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించాయి.
ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే..
0.387 రన్‌రేట్‌తో ఆర్‌సీబీ ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు తమ చివరి లీగ్ మ్యాచ్‌ను బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఆర్‌సీబీ 18 ప్లస్ రన్స్ తేడాతో ఓడించాలి. లేదా 18.1 ఓవర్లలోనే సీఎస్‌కే విధించిన లక్ష్యాన్ని చేధించాలి.
అప్పుడే సీఎస్‌కే కంటే మెరుగైన రన్‌రేట్ సాధించి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధిస్తోంది. అంతేకాకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఓడాలి.
లక్నో తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి, సన్‌రైజర్స్ ఒక మ్యాచ్ గెలిస్తే చెన్నై చేతిలో టాస్ ఓడినా.. ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడితే ఎలాంటి సమీకరణతో సంబంధం లేకుండా ఆర్‌సీబీ ఇంటిదారిపడుతోంది.
సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరాలంటే..
ఆర్‌సీబీతో జరిగే చివరి మ్యాచ్‌లో విజయం సాధిస్తే చెన్నై సూపర్ కింగ్స్ 16 పాయింట్స్‌తో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంటుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించినా.. ఆర్‌సీబీ మెరుగైన రన్‌రేట్‌తో గెలిచినా చెన్నై నిష్క్రమిస్తోంది.
డేంజర్ జోన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్..
14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా మెరుగైన రన్‌రేట్‌తో గెలవడం కీలకం. ఈ రెండు మ్యాచ్‌ల్లో ఓడితే మాత్రం సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటుంది.
సన్‌రైజర్స్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లో సన్‌రైజర్స్ ఓడి.. లక్నో సూపర్ జెయింట్స్ ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఆర్‌సీబీ, సీఎస్‌కే ప్లే ఆఫ్స్ చేరుతాయి.