Tuesday, November 26, 2024

Sunrisers : క‌మిన్స్ ….క‌మాన్…క‌ప్పు తెచ్చేయ్

ఐపీఎల్‌- 2024లో తుది సమరానికి సర్వం సిద్ధమైంది. 65 రోజులు, 73 మ్యాచ్‌ల తర్వాత ఐపీఎల్‌-17 విజేతను తేల్చే మ్యాచ్‌ నేడు చెన్నై వేదికవుతోంది. ఫైనల్‌ చేరిన సన్‌రైజర్స్‌ జట్టు రాజస్థాన్ కు ఆఖరి పంచ్‌ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. తొలి క్వాలిఫయర్‌లో తమను దెబ్బ తీసిన కేకేఆర్ తో ఇప్పుడు మళ్లీ పోటీ తలపడబోతుంది.

- Advertisement -

గత మ్యాచ్‌కు ప్రతీకారం తీర్చుకునేందుకు హైదరాబాదీ టీమ్ ఎదురు చూస్తుంది. సన్ రైజర్స్‌ చెలరేగితే రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచే ఛాన్స్ ఉంది. 2016లో చివరిసారిగా టైటిల్‌ సాధించిన హైదరాబాద్‌ 2018లో ఫైనల్‌ వరకు వచ్చి ఓడిపోయింది. 2012, 2014లలో ఐపీఎల్‌ టైటిల్ గెలుచిన కోల్‌కతా ఇప్పుడు మూడోసారి ట్రోఫీపై నజర్ పెట్టింది. ఈ మ్యాచ్‌ చెన్నైలో జరుగుతుండడంతో మన హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్‌ గెలిస్తే మనకు టైటిల్ అందించిన మూడో ఆస్ట్రేలియన్ గా ప్యాట్ కమిన్స్‌ నిలుస్తాడు.

ఇక, స‌న్‌రైజర్స్‌ హైదరాబాద్.. ఓ పడిలేచిన కేరటం.. లాస్ట్‌ సీజన్‌లో అట్టడుగున ఉన్న ఈ టీమ్.. ఇప్పుడు రయ్‌.. రయ్‌ మంటూ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో తాడో పెడో తేల్చుకోనుంది. అసలు రైజర్స్‌ రైజింగ్‌ వెనక రీజన్సేంటి. లాస్ట్ సీజన్‌కి.. ఈ సీజన్‌కి మారిందేంటి.. ? 2023 ఐపీఎల్ సీజన్‌ SRHకు ఓ పీడకల.. 14 మ్యాచ్‌లు ఆడితే.. గెలిచింది కేవలం 4 మ్యాచ్‌లే.. ఇప్పుడా కౌంట్ డబుల్ అయ్యింది. ఫామ్‌లో.. జోష్‌లో.. ఎక్కడా తగ్గడం లేదు SRH. క్వాలిఫైయర్‌ వన్‌ మ్యాచ్‌లో ఓడినా.. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి మళ్లీ ఫైనల్‌ చేరింది. ఎక్కడ ఓడిందో.. మళ్లీ అదే టీమ్‌ను మట్టికరిపించింది.. కప్పు ఎత్తేందుకు సిద్ధమైంది.

స్టాట్స్‌.. సెంటిమెంట్స్.. ఇలా ఎందులో చూసుకున్నా హాట్ ఫెవరేట్‌ టీమ్ స‌న్ రైజ‌ర్స్. ఒక్కసారి కాస్త పాస్ట్‌కి వెళదాం. ఐపీఎల్‌ స్టార్టయ్యింది 2008లో.. అప్పుడు హైదరాబాద్‌ టీమ్‌ పేరు డక్కన్ చార్జర్స్.. ఆ సీజన్‌లో కూడా పాయింట్స్‌ టేబుల్‌లో లాస్ట్‌లో ఉంది డీసీ.. బట్ నెక్ట్స్ సీజన్‌లో కప్పు కొట్టేసింది. ఇప్పుడు కూడా అదే సీన్ రీపిట్ అవుతుంది చూడండి అంటూ అభిమానులు ముందే సంబరాలకు రెడీ అయిపోయారు. 2023లో పాయింట్స్‌ టేబుల్‌లో లాస్ట్‌ ప్లేస్ స‌న్ రైజ‌ర్స్ ది. ఆ లెక్కన చూసుకుంటే కప్పు మనదే కదా మరి.

నిజానికి సీజన్ స్టార్టింగ్‌లో ఉన్న టీమ్ సిట్యూవేషన్‌కి.. ఇప్పటికి అసలు సంబంధమే లేదు. అయితే కథ ఎక్కడ మొదలైందో.. మళ్లీ అక్కడికే వచ్చి ఆగినట్టు ఉంది పరిస్థితి.. ఎందుకంటే ఫైనల్స్‌లో తలపడేది కోల్‌కత్, హైదరాబాద్ కాబట్టి.. ఈ సీజన్‌లో ఈ రెండు టీమ్స్.. హెడ్ టు హెడ్ మ్యాచ్‌తోనే మొదలుపెట్టాయి. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో కేవలం ఫోర్స్‌ తేడాతో మ్యాచ్‌ ఓడింది హైదరాబాద్. అయితే కేకేఆర్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు.

ఈ సీజన్‌లో పాయింట్స్‌ టేబుల్‌లో టాప్‌లో ఉంది ఆ టీమే.. క్వాలిఫైయర్ వన్‌ మ్యాచ్‌లో స‌న్ రైజ‌ర్స్ ను బీట్ చేసి నేరుగా ఫైనల్స్‌కు వెళ్లారు. ప్రివియస్‌గా కేకేఆర్‌ మూడు ఫైనల్స్‌ ఆడితే 2012, 2014లో.. రెండింటిలో గెలిచారు. 2021 ఫైనల్స్‌లో మాత్రం ఓడారు. ఫైనల్స్‌లో 200 రన్స్‌ను చేజ్ చేసిన టీమ్.. కెకెఆర్.. ఫైనల్స్‌లో ఇంత టార్గెట్‌ను చేజ్ చేసిన రికార్డ్‌ ఇప్పటికి కూడా అదే టీమ్‌ది. ఇక ఇండియాలో ఆడిన ఏ ఫైనల్‌ మ్యాచ్‌లోనూ ఇంత వరకు ఓడిపోలేదు కెకెఆర్.. 2021లో ఓడింది కూడా దుబాయ్‌లోనే.. సో.. ఈ సెంటిమెంట్‌ కాస్త కంగారు పెడుతోంది.

మరి ఈ రికార్డులను చూసి మనం భయపడలా.. నో.. నెవ్వర్.. రికార్డులు నెలకొల్పాలన్నా.. వాటిని తిరగరాయాలన్నా.. మన టీమ్‌ను మించిన వారు లేరుగా.. పవర్ ప్లేలో అత్యధిక పరుగులు చేసిన టీమ్‌.. స‌న్ రైజ‌ర్స్..ఇప్పటికే రెండు సార్లు పవర్ ప్లే 6 ఓవర్లలో 100 పరుగులు దాటించింది. ఐపీఎల్ చరిత్రలో తక్కువ బాల్స్‌లో టార్గెట్‌ను చేజ్‌ చేసిన టీమ్.. స‌న్ రైజ‌ర్స్.. హెడ్, అభిషేక్ ఇద్దరూ కలిసి కేవలం 62 బాల్స్‌లోనే 166 పరుగులను చేజ్‌ చేసి పారేశారు. ఇప్పుడిదే నెంబర్ వన్‌ రికార్డ్.. ఐపీఎల్ చరిత్రలో 10 ఓవర్లలో మూడు సార్లు అత్యధిక పరుగులు చేసిన టీమ్..స‌న్ రైజ‌ర్స్.. హైఎస్ట్‌ టీమ్‌ స్కోర్.. మనదే.. సింపుల్‌గా ఇది సన్ రైజర్స్ హైదరాబాద్‌ నామ సంవత్సరం.. సో కేకేఆర్‌ అన్ బీటబుల్‌ రికార్డ్‌ను చూసి భయపడలా.. అస్సలు అవసరం లేదు. ఈసారి ఈ రికార్డ్‌ను కూడా తిరగరాసేది మనమే.. డోంట్ వర్రీ..

హెడ్‌ మళ్లీ చెలరేగాలి.. క్లాసెన్ క్లాస్ ఆట చూడాలి.. అభిషేక్‌ శర్మ, త్రిపాఠి.. బౌలర్స్‌ను షేక్ చేయాలి.. నితిష్‌ బాల్‌ను చెడుగుడు ఆడుకోవాలి.. భువనేశ్వర్ నిప్పులు చెరిగే బంతులు వేయాలి. నటరాజ్‌, కమిన్స్‌ ప్రత్యర్థులను కూల్చాలి.. ఇక షాబాజ్, సమద్ తమ ఇంపాక్ట్ చూపించాలి.. So Lets Rise up Guys..and lift the cup.. You guys rise to every challenge.. మర్చిపోకండి.. All the Best

Advertisement

తాజా వార్తలు

Advertisement