Friday, November 22, 2024

Sunrisers Hyderabad : బ‌ల‌మైన బ్యాటింగ్ తో బ‌రిలోకి స‌న్ రైజ‌ర్స్

ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రసవత్తరపోకు సిద్దమైంది. గుజరాత్ టైటాన్స్‌తో గురువారం ఉప్పల్ వేదికగా జరగనున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అమీతుమీ తేల్చుకోనుంది. ప్రస్తుతం 14 పాయింట్స్‌తో పాయింట్స్ టేబుల్‌లో నాలుగో స్థానంలో నిలిచింది.

- Advertisement -

ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోవాలంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలవాలి. చివరి రెండు మ్యాచ్‌లను మెరుగైన రన్‌రేట్‌తో విజయం సాధిస్తే టాప్-2లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది.

టాప్-2 ప్లేస్ టార్గెట్..
ఈ క్రమంలోనే టాప్-2 ప్లేస్‌పై గురిపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు లక్ష్యంగా సిద్దమవుతోంది. చివరి రెండు మ్యాచ్‌లు హోమ్ గ్రౌండ్‌లోనే జరుగుతుండటం ఆరెంజ్ ఆర్మీకి కలిసొచ్చే అంశం. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 వికెట్ల భారీ తేడాతో గెలుపొందింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో 166 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే చేధించింది. ఇదే జోరును గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కూడా కొనసాగించాలని సన్‌రైజర్స్ భావిస్తోంది.

కావాల్సిన విశ్రాంతి..
ఈ మ్యాచ్‌కు 8 రోజుల గడువు దొరకడంతో ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్ భారత్‌ను విడిచి దుబాయ్‌కు వెళ్లారు. ఫ్యామిలీతో ఈ విశ్రాంతి సమయాన్ని గడిపేందుకు వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే గత రాత్రే కమిన్స్, హెడ్ హైదరాబాద్‌కు చేరుకొని ప్రాక్టీస్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక మార్పు చేసే అవకాశం ఉంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో విజయ్‌కాంత్ వియస్కాంత్‌ను తుది జట్టులోకి తీసుకోగా.. అతను పెద్దగా ప్రభావం చూపలేదు. కట్టడిగా బౌలింగ్ చేసినా వికెట్లు తీయలేదు. ఈ క్రమంలోనే అతని స్థానంలో న్యూజిలాండ్ విధ్వంసకర బ్యాటర్ గ్లేన్ ఫిలిప్స్‌ను ఆడించే అవకాశం ఉంది.

4డీ ప్లేయర్‌కు ఛాన్స్..

గ్లేన్ ఫిలిప్స్ స్పిన్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్, కీపింగ్, ఫీల్డింగ్ చేయగలడు. జట్టులోని ప్రతీ ఒక్కరికి అవకాశం ఇచ్చిన ఆరెంజ్ ఆర్మీ.. ఈ 4డీ ప్లేయర్‌ను మాత్రం బెంచ్‌కే పరిమితం చేసింది. కీలక మ్యాచ్‌ల్లో అతన్ని ఔటాఫ్ సిలబస్‌లా బరిలోకి దించాలని భావిస్తోంది. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అతను తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

విజయ్ కాంత్ వియస్కాంత్‌ను కొనసాగించాలనుకుంటే మాత్రం అతను మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఇది మినహా తుది జట్టులో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఆడనుండగా.. నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షెహ్‌బాజ్ అహ్మద్ మిడిలార్డర్‌లో ఆడనున్నారు.

ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. అభిషేక్ శర్మ, నటరాజన్‌లను ఇంపాక్ట్ ప్లేయర్లుగా వాడుకోనున్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు(అంచనా)

అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షెహ్‌బాజ్ అహ్మద్, సన్వీర్ సింగ్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనాద్కత్, విజయ్‌కాంత్ వియస్కాంత్

ఇంపాక్ట్ ప్లేయర్: నటరాజన్

Advertisement

తాజా వార్తలు

Advertisement