Saturday, November 23, 2024

అయ్యర్ లాంటి వారికోసమే టీమిండియా ఎదురుచూపులు: సునీల్ గవాస్కర్..

ఐపీఎల్‌ 2021 సెకెండ్‌ ఫేజ్‌లో అదరగొడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌పై సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. వెంకటేశ్ అయ్యర్ ఆల్ రౌండర్‌గా టీమిండియాలో దృష్టిలో పడవచ్చని అతడు అభిప్రాయపడ్డాడు. హార్దిక్ పాండ్యా  ప్రస్తుతం క్రమంగా బౌలింగ్‌  చేయకపోవడంతో ఆల్‌రౌండర్‌ జాబితాలో  అయ్యర్‌ పైన అందరి దృష్టి మళ్ళిందిని  గవాస్కర్ తెలిపాడు.

“టీమిండియా ప్రస్తుతం వెంకటేష్ అయ్యర్‌ లాంటి ఆల్ రౌండర్‌ కోసమే ఎదురు చూస్తుంది. అతడు బౌలింగ్‌లో యార్కర్‌లని బాగా వేస్తున్నాడు. అతడు బ్యాట్స్‌మన్‌లకు భారీ షాట్‌లు ఆడే అవకాశం ఇ‍్వడంలేదు. ఇక బ్యాటింగ్‌ విషయానికి వస్తే షార్ట్ బాల్‌ను బాగా పుల్‌ చేస్తున్నాడు. కవర్‌ డ్రైవ్‌ షాట్‌లు ఆడగలడని” టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీల్‌ గవాస్కర్ పేర్కొన్నాడు.ప్లేఆఫ్‌కు అర్హత సాధించేందుకు అవకాశాలను కోల్‌కతా సద్వినియోగ పరుచుకుందని అతడు చెప్పాడు. కాగా  ఐపీఎల్‌లో ఇప్పటి వరకు  నాలుగు  మ్యాచ్‌లు ఆడిన వెంకటేశ్ అయ్యర్126 పరుగులు, 2 వికెట్లు సాధించాడు.

ఇది కూడా చదవండి: ద్రావిడ్ టీమిండియా కోచ్ అవుతాడు..ఎమ్మెస్కే ప్రసాద్‌ ఛాలెంజ్

Advertisement

తాజా వార్తలు

Advertisement