ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ కెప్టెన్ సునీల్ ఛెత్రీ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్ చేసిన లిస్ట్‌లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీని వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు. 2022 ఫిఫా వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఛెత్రీ 2 గోల్స్ చేశాడు. దీంతో ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్‌లో అతని గోల్స్ సంఖ్య 74కు చేరింది. మెస్సీ 72 గోల్స్‌తో నాలుగోస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (103 గోల్స్) మాత్రమే సునీల్ ఛెత్రీ కంటే ముందున్నాడు. యూఏఈకి చెందిన అలీ మబ్‌ఖౌత్ 73 గోల్స్‌తో మూడోస్థానంలో ఉన్నాడు. మెస్సీని ఛెత్రీ వెనక్కి నెట్టిన విషయాన్ని ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ తన ట్విటర్‌లో వెల్లడించాడు. ఛెత్రీకి శుభాకాంక్షలు చెప్పాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement