హైదరాబాద్ : ఐపిఎల్ లో లీగ్ మ్యాచ్ లలో ఇంత వరకు బోణి కొట్టని టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టే.. ఇప్పటి వరకు రెండు మ్యాచ్ లో ఆడిన సన్ రెండింటిలోనూ ఘోరంగా ఓడిపోయింది.. కొత్తగా పగ్గలు చేపట్టిన సౌతాఫ్రికా మాకరమ్ ఆడిని తొలి మ్యాచ్ లోనే గోల్డెన్ డక్ తో పెవిలియన్ చేరాడు.. ఇక తన మూడో మ్యాచ్ ను స్వంత మైదానం ఉప్పల్ స్టేడియంలో పటిష్టమైన పంజాబ్ కింగ్స్ ను నేడు ఎదుర్కోబోతున్నది. గత రెండు సీజన్లలో 8వ స్థానంలో నిలిచిన హైదరాబాద్ ఈ సీజన్‌లోనైనా స్థానాన్ని మెరుగుపరచుకోవాలని ఆశిస్తున్నది. బలమైన బౌలింగ్ ఉన్న సన్ రైజర్స్ కు బ్యాటింగ్ లో వైపల్యాలు కనిపిస్తున్నాయి..క్రీజ్ లో కుదురుకోకముందే పెవిలియన్ బాట పడుతున్నారు..ఇదే విషయాన్ని హెడ్ కోచ్ లారా అంగీకరించాడు. కొత్త కెప్టెన్ ఎయిడెన్ మార్క్మ్‌క్రూడా వారి తలరాతను మార్చలేకపోతున్నాడు. భారీ ఆశలు పెట్టుకున్న హ్యారీ బ్రూక్ స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేకపోతున్నాడు. బ్రూక్ టెస్ట్ లో పరుగుల వరద పారించినా పొట్టి క్రికెట్ లో ఆడిన రెండు మ్యాచ్ లలో నిరాశపరిచాడు.. కనీసం ఈ మ్యాచ్ అయినా గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.. ఈ మ్యాచ్ నేటి రాత్రి 7.30కి ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement