దక్షిణాఫ్రికాలో కింగ్ కోహ్లీని దుండగులు వెంటాడారు. అదేంటి బెంగళూరులో ఉన్న కోహ్లీ, దక్షిణాఫ్రికా ఎప్పుడు వెళ్లాడా అనుకోకండి.. అండర్-19లో ఆడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విషయాన్ని కోహ్లీ చిన్ననాటి స్నేహితుడు, అండర్ 19 మాజీ సభ్యుడు ప్రదీప్ సాంగ్వాన్ చెప్పుకొచ్చాడు. 2008లో అండర్-19 ప్రపంచ కప్‌కు ముందు ఈ ఘటన జరిగింది. కోహ్లీకి స్ట్రీట్ ఫుడ్ అంటే ఎంతో ఇష్టం. కుర్మా రోల్స్, చికెన్ రోల్స్ అంటే మరీ ఇష్టం. అండర్-19 జట్టుతో దక్షిణాఫ్రికా వెళ్లాడు. స్ట్రీట్ ఫుడ్ కోసం రిస్క్ చేశాడు.
బస చేసే హోటల్‌కు దగ్గరలో మటన్ రోల్స్ దొరుకుతాయని ఓ స్నేహితుడు చెప్పడంతో ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధం అయ్యాడు. ఆ ప్రాంతం సురక్షితం కాదని, గొడవలు జరుగుతాయని డ్రైవర్ చెప్పినా వినిపించుకోలేదని ప్రదీప్ చెప్పుకొచ్చాడు. ఎలాగోలా అక్కడికి వెళ్లిన కోహ్లీ.. తినడం పూర్తయ్యాక.. తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో కొందరు దుండగులు అతన్ని వెంటాడారు. ఆ తరువాత ఎలాగోలా హోటల్‌కు చేరుకున్నామని ప్రదీప్ చెప్పుకొచ్చాడు. స్ట్రీట్ ఫుడ్ అంటే ఎంతో ఇష్టపడే కోహ్లీ.. 2012 తరువాత ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టాడు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..