ఫ్రెంచ్ ఓపెన్ రన్నరప్, మూడో సీడ్ స్టెఫనోస్ సిట్సిపాస్ వింబుల్డన్ తొలి రౌండ్లోనే ఓడి ఇంటిముఖం పట్టాడు. తొలి రౌండ్లో గ్రీస్ ఆటగాడు సిట్సిపాస్ 4-6, 4-6, 3-6తో ఫ్రాన్స్ టియాఫో చేతిలో ఓటమిపాలయ్యాడు. డిఫెండింగ్ చాంప్ నొవాక్ జొకోవిచ్, రెండో సీడ్ అరియానా సబలెంకా, సోఫియా కెనిన్, 7వ సీడ్ స్వియటెక్ రెండో రౌండ్‌కు చేరుకొన్నారు. మాజీ చాంపియన్ పెట్రా క్విటోవాకు షాక్ తగిలింది. వర్షం కారణంగా తొలి రోజు జరగాల్సిన 64 మ్యాచ్‌ల్లో 16 రద్దయ్యాయి. కొవిడ్ నిబంధనలను పాటిస్తూనే పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించడంతో కొంత సందడి కనిపించింది.
ఇది కూడా చదవండి: వింబుల్డన్.. ఈ దిగ్గజాలకు ఇదే ఆఖరుదా?