పారిస్ ఒలింపిక్స్ కోసం సన్నద్ధ మవుతున్న భారత స్టార్ రెజ్లర్ బజరంగ్ పునియాకు భారీ షాక్ తగిలింది. డోపింగ్ పరీక్షకు శాం పిల్ ఇవ్వనందుకు బజరంగ్‌పై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (ఎన్ఏడీఏ) సస్పెన్షన్ వేటు వేసింది. దాంతో త్వరలో ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది.
ఈ ఏడాది మార్చిలో సోనిపట్ వేదికగా జరిగిన ట్రయల్స్ జరిగాయి. అయితే ఈ పోటీల అనంత రం ఎన్డీఏ బజరంగ్‌కు డోప్ టెస్ట్ కోసం మూత్ర నమూనాలను కోరింది. కానీ శాంపిల్ ఇచ్చేందుకు పునియా నిరాకరించడంతో తాజాగా ఎన్ఏడీఏ చర్యలకు దిగి అతడిపై వేటు వేసింది.
దాంతో త్వరలో ఒలింపిక్స్ కోసం జరగనున్న ట్రయల్స్‌లోనూ బజరంగ్ పాల్గొనడం కష్టమనిపిస్తోంది. తాజా గా ఈ విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన బజరంగ్ పునియా.. తాను ఎన్ఏడీఏ అధికారులకు నమూనాలను ఇచ్చేందుకు ఎప్పుడూ నిరాకరించ లేదు. వారు నాకు గడువు ముగిసిన టెస్టు కిట్లు ఇచ్చారు. ఔట్‌డేటెడ్ కిట్లు ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులతో కోరారు. ఆ తర్వాత శాంపిల్ ఇస్తానని చేప్పాను. కానీ ఇప్పటివరకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు అని పునియా పేర్కొన్నాడు. ఇక కొద్దికాలంగా లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషన్‌పై బజరంగ్ పునియా, సాక్షి మలిక్, వినేశ్ ఫొగాట్‌లు పోరాటం చేస్తున్నారు.