Sunday, September 15, 2024

Radha Yadav | వ‌ర‌ద‌ల‌లో చిక్కుకున్న స్టార్ స్పిన్న‌ర్ ..

గుజరాత్‌లో భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదలతో రాష్ట్రమంతా వణికిపోతోంది. వడోదరలో ఇప్పుడు వర్షం పడటం ఆగినా పరిస్థితులు మాత్రం దారుణంగానే ఉన్నాయి. విశ్వమిత్రి నదికి వరద పోటెత్తింది. ఈ వరదల్లో భారత మహిళా క్రికెటర్ రాధా యాదవ్‌ కుటుంబం చిక్కుకుపోయింది.

ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది తమను రక్షించినట్లు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టింది. ”రోడ్లన్నీ నీటితో ముగినిపోయాయి. మేమంతా అందులో చిక్కుకుపోయాం. మమ్మల్ని రక్షించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి ధన్యవాదాలు” అని రాధా యాదవ్ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement