జకర్తాలో మొదలైన ఇండోనేసియన్ ఓపెన్ సూపర్ సిరీస్ నుంచి స్టార్ బ్యాడ్మింటన్ ద్వయం సైనా నెహ్వాల్, పారుపల్లి కాశ్యప్‌తోపాటు ఇటీవలి ధామస్ కప్ హీరో హెచ్‌ఎస్ ప్రణయ్ అవుటయ్యారు. పనిభారాన్ని సాకుగా చూపుతూ భారత తొలి ఒలింపిక్ మెడల్ విజేత సైనా తప్పుకోగా…ఇటీవలి మ్యాచ్‌లో గాయాలపాలైన కాశ్యప్…ఇంకా కోలుకోలేదు. ‘సెలక్షన్ ట్రయల్స్‌కు ముందు గాయపడ్డా. అది తగ్గడానికి అనేక వారాల సమయం పట్టింది. ఇంకా నాకు యాంకిల్ సమస్య కూడా ఉంది’ అని చెప్పుకొచ్చాడు కాశ్యప్. ఇప్పుడు బాగానే ఉన్నానని, అయితే ఫిట్నెస్ సరిగా లేదని తెలిపాడు. మరో నాలుగు ఈవెంట్ల తర్వాత పాల్గొందామని అనుకుంటున్నా’ అని చెప్పుకొచ్చాడు. ఇక సైనా అనేక టోర్నమెంట్ల కారణంగా ఆట నుంచి వైదొలగిందని తెలిపాడు. వచ్చే వారం ఆడాలని నిర్ణయించుకుందన్నాడు.
సైనా ఇప్పుడు బాగానే ఉందని, ఈ ఒక్కసారి మాత్రమే తప్పుకుంటోందని వివరించాడు. గత నెలలో జరిగిన థామస్ కప్‌లో భారత్ విజయం సాధించింది. ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన ప్రణయ్ రాయ్ ప్రస్తుతానికి పోటీ నుంచి తప్పుకున్నాడు. తన టూర్‌లో భాగంగా ఆడనున్న మరో నాలుగు ఈవెంట్లపై మనసును లగ్నం చేశాడు. ‘ఇండోనేషియా ఈవెంట్ నుంచి తప్పుకుంటున్నా. తర్వాత జరిగే వాటిల్లో పాల్గొంటా. మరికొద్దివారాలపాటు వేచిచూస్తా’ అని వివరించాడు. థామస్ కప్ విజయంతో పురుషుల టీం సరికొత్త శిఖరాలను చేరుకుంది. 14 సార్లు చాంపియన్‌గా నిలిచిన ఇండోనేసియాను భారత జట్టు ఓడించింది. అందరినీ అబ్బురపరిచింది. తొలిసారిగా టైటిల్‌ను కైవసం చేసుకుంది. అయితే ఈ ముగ్గురు ఇప్పుడు తప్పుకోవడంతో భారత జట్టు పురుషుల విభాగాన్ని కోల్పోయింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.