ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్న భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. గిల్‌కు డెంగీ సోకినట్టు సమాచారం అందుతోంది. దీంతో అతను ఈ ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇవ్వాల (శుక్రవారం) గిల్‌కు మరో సారి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే మెడికల్ రిపోర్టుల అధారంగా శుభ్‌మన్ గిల్ ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌లో ఆడేదీ లేనిదీ నిర్ణయిస్తామని టీమ్ మేనేజ్మెంట్ తెలిపింది.
ఇక.. అక్టోబర్ 8న చెన్నైలోని చిదంబరం స్టేడియంలో భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ సమయానికి గిల్ ఆరోగ్యం మెరుగుపడకపోతే కేఎల్ రాహుల్ లేదా ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా దిగే అవకాశం ఉందని సమాచారం అందుతోంఇ. 2019 నాటి ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్ భారత్ ఓపెనర్‌గా బరిలోకి దిగారు. అప్పట్లో గాయం కారణంగా శిఖర్ ధవన్ అందుబాటులో లేకపోవడంతో రాహుల్‌ను దించాల్సి వచ్చింది. ఈ మధ్య కాలంలో రోహిత్ అందుబాటులో లేని పలు మ్యాచ్‌ల్లో ఇషాన్ ఓపెనర్‌గా దిగుతున్నారు.
ప్రస్తుతం అద్భుత ఫామ్‌లో ఉన్న శుభ్‌మన్ గిల్ ఈ ఏడాది ఇప్పటివరకూ 20 వన్డేల్లో ఏకంగా 1230 పరుగులు చేశారు. వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం రెండో ప్లేస్‌లో గిల్ కొనసాగుతున్నారు. దీంతో, అతడు తొలి మ్యాచ్‌కు దూరమైతే భారత్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.