Wednesday, November 20, 2024

Jyothi Yarraji | అమ్మ క‌ష్టం నుంచి అంత‌ర్జాతీయ స్థాయికి…

విశ్వక్రీడలకు పారిస్ ముస్తాబైంది. మరో ఎనిమిది రోజుల్లో ఒలింపిక్స్ ప్రారంభంకానున్నాయి. పతకాల వేట కోసం భారత్ నుంచి 117 మంది బరిలోకి దిగుతున్నారు. ప్రపంచ వేదికపై భారత్ ఖ్యాతిని మరింత చాటేలా మన క్రీడాకారులు పట్టుదలతో సిద్ధమయ్యారు. అయితే వాళ్లలో తెలుగు అమ్మాయి జ్యోతి యర్రాజి కూడా ఒకరు.

అథ్లెట్ జ్యోతి యర్రాజి బరిలోకి దిగకముందే చరిత్ర సృష్ఠించింది. ఒలింపిక్స్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీపడనున్న మొదటి భారత అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఏ భారత క్రీడారులు సాధించని ఘనతను 24 ఏళ్ల తెలుగు బిడ్డ సాధించింది. వరల్డ్‌ ర్యాంకింగ్స్‌ కోటాలో పారిస్‌ బెర్త్‌ దక్కించుకుంది.

అయితే, విశాఖపట్నంలో పేద కుటుంబంలో జన్మించిన జ్యోతి యర్రాజీ విశ్వక్రీడలకు వరకు చేరుకోవడానికి తీవ్రంగా శ్రమించింది. కష్టాల కడలిని దాటి ఇంతటి స్థాయికి వచ్చింది. ఈ ప్రయాణంతో ఆమె తల్లి కుమారి కష్టం ఎంతో ఉంది. అమ్మ అండతోనే భారత టాప్ అథ్లెట్‌గా జ్మోతి ఎదిగింది. జ్యోతికి చిన్నతనం నుంచే క్రీడారంగా ఆసక్తి ఉన్నా కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. కానీ తల్లి కుమారి జ్యోతిని ఎంతో ప్రోత్సహించారు.

జ్యోతి భవిష్యత్ కోసం డబుల్ షిఫ్ట్ పని చేశారు. ఇళ్లల్లో పనిచేయడంతో పాటు స్థానిక ఆసుపత్రిలో క్లీనర్‌గా పనిచేశారు. తల్లి కష్టాన్ని వృథా చేయకుండా జ్యోతి తీవ్రంగా శ్రమించి 100 మీటర్ల హర్డిల్స్‌లో రికార్డులు తిరగ రాసింది. 12.78 సెకన్లతో జాతీయ రికార్డు నెలకొల్పింది. జ్యోతి అత్యున్నత అథ్లెట్‌గా ఎదగడంలో అమ్మ కష్టంతో పాటు కోచ్ జేమ్స్ హీలియర్ కూడా ప్రధాన పాత్ర వహించారు.

”విశ్వక్రీడల్లో పోటీపడిన అనుభవం లేదు. కానీ పారిస్ ఒలింపింక్స్‌లో సత్తాచాటుతాననే నమ్మకంతో ఉన్నా. ఏషియన్ గేమ్స్, ఏషియన్ ఛాంపియన్‌షిప్స్, వరల్డ్ ఛాంపియన్స్‌ వంటి మెగాటోర్నీలో పోటీపడిన అనుభవం ఉంది. వాటిలోని సానుకూలాంశాలతో ముందుకు వెళ్తున్నా. ఒలింపిక్స్‌లో ఒత్తిడి ఉటుంది, కానీ దాన్ని జయించగలను”- జ్యోతి యర్రాజీ

Advertisement

తాజా వార్తలు

Advertisement