ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్‌లో ఒలింపిక్ చాంపియన్ నీరజ్ చోప్రా సారథ్యంలోని భారత అథ్లెట్ల బృందం పతకాలపై ఆశలు రేపుతోంది. లాంగ్ జంప్‌లో మురళీ శ్రీశంకర్ చరిత్ర సృష్టించాడు. అమెరికాలోని ఒరేగాన్ రాష్ట్రం హ్యూజిన్లోని హెవార్డ్ స్టేడియంలో జరుగుతున్న ఈ టోర్నీలో ఫైనల్ చేరిన భారత తొలి పురుష లాంగ్ జంపర్‌గా రికార్డు సృష్టించాడు. శ్రీశంకర్తోపాటు అవినాశ్ సాబ్లే పురుషుల 3వేల మీటర్ల స్టీపుల్ చేజ్ పతక రౌండ్‌కు అర్హత సాధించాడు. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న మురళీ శ్రీశంకర్ పురుషుల లాంగ్ జంప్ అర్హత పోటీల్లో 8 మీటర్ల దూరం దూకాడు.
తన సమీప పోటీదారులౖౖెన జెస్విన్ ఆల్ట్రిన్ (7.79 మీటర్లు), మొహమ్మద్ అనీస్ యాహియా (7.73 మీటర్లు) కంటే ముందుగా 8 మీటర్లు దూకి నేరుగా ఈవెంట్లో ఫైనల్‌కు అర్హత సాధించాడు. శ్రీశంకర్ మే నెలలో అత్యధికంగా 8.36 మీటర్ల మార్కు అందుకున్న నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక పోటీల్లో పతకం సాధించే అవకాశం ఉంది. ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్ నుంచి ఇప్పటి దాకా అంజూ బాబీ జార్జ్ (లాంగ్ జంపర్) ఏకైక కాంస్య పతకం గెలిచింది. ఇక భారత ఆర్మీ క్రీడాకారుడైన అవినాశ్ 3వేల మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో 8:18.75 టైమింగ్‌తో హీట్స్‌లో మూడో స్థానంలో నిలిచి నేరుగా పతక రౌండ్‌కు అర్హత సాధించాడు. ఇక షాట్‌పుట్‌లో తజిందర్‌పాల్ సింగ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.