ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింగపూర్ షట్లర్ కీన్‌పై ఓటమితో రజతంతో సరిపెట్టుకున్న భారత స్టార్ షట్లర్ శ్రీకాంత్‌కు ప్రతీకారం తీర్చుకునే అవకాశం దక్కింది. జనవరిలో ప్రారంభంకానున్న యోనెక్స్ సన్రైస్ ఇండియా ఓపెన్ టోర్నీలో వీరిద్దరూ మరోసారి ముఖాముఖి తలపడనున్నారు. సిరిల్వర్మతో తొలి మ్యాచ్ ఆడనున్న శ్రీకాంత్ సెమీస్‌లో కీన్‌ను ఢీకొట్టనున్నాడు. కాగా ఈ టోర్నీ సూపర్ 500 ఈవెంట్లో యువ షట్లర్ లక్ష్యసేన్‌కు సులువైన డ్రా లభించింది. ఈజిప్ట్‌కు చెందిన అధమ్తో సేన్ తొలి మ్యాచ్ ఆడనున్నాడు. క్వార్టర్స్‌లో ప్రణయ్‌తో ముఖముఖా పోరును ఎదుర్కోనున్నాడు.
ప్రణయ్ తన తొలి మ్యాచ్‌ను పాబ్లోతో ఆడనున్నాడు. మహిళల సింగిల్స్‌లో సింధుకు సులువైన డ్రా లభించింది. తొలి మ్యాచ్‌ను సింధు..శ్రీకృష్ణప్రియతో ఆడనుంది. అయితే గాయాలబారినపడిన సైనా క్వార్టర్స్‌లో యూఎస్‌కు చెందినన ఏడోసీడ్ ఇరిష్వాంగ్తో, సెమీస్‌లో రెండో సీడ్ బుసనన్ ఎదుర్కోనుంది. పురుషుల డబుల్స్‌లో చిరాగ్-సాతిక్ జోడీ రవి-అరోరా జోడీతో తొలి మ్యాచ్‌ను ఆడనున్నారు. మహిళల డబుల్స్‌లో రెండో సీడ్ అశిని-సిక్కిరెడ్డి సులువైన డ్రా లభించింది. కానీ మిక్స్డ్ డబుల్స్‌లో సుమిత్-అశ్వినికి రోండోసీడ్ రష్యాకు చెందిన రొడియోన్-అలీనాతో తలపడనున్నారు. కాగా ఈ టోర్నీ ఢిల్లిd వేదికగా జనవరి 11నుంచి ప్రారంభం కానుంది.