ఆసియాకప్‌లో భాగంగా పాకిస్తాన్ జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో శ్రీలంక విజయకేతనం ఎగరేసింది. మొన్న భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచిన జోష్‌లో ఉన్న శ్రీలంక జట్టు ఇవ్వాల అదే ఆటతీరును ప్రదర్శించి పాక్‌ని చిత్తు చేసింది. టీ20లో భాగంగా తొలుత పాకిస్తాన్ బ్యాటింగ్ చేయగా.. 121 పరుగులకే ఆల్ అవుటయ్యింది. ఆ టీమ్‌లో ఒక్క బాబర్ ఆజామ్ మాత్రమే (30) మెరుగైన ఆటతీరు కనబరిచాడు. ఆ తర్వాత మహ్మద్ నవాజ్ (26) పర్వాలేదనిపించాడు. ఇక ఆ తర్వాత మిగతా ఆటగాళ్లు లంక బౌలర్ల ముందు తలవంచి పెవిలియన్‌కు క్యూకట్టారు. ఇద్దరు డక్ అవుట్ కాగా, మిగతా వారిలో చాలామంది 14, 13 పరుగులకే అవుటయ్యారు.
కాగా, సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టులో ఓపెనర్ నిసాంకా 55 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. చివరిదాకా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మెండిస్, గుణతిలక డకౌట్లు కాగా, నిసాంక మాత్రం నిదానంగా ఆడుతూ వికెట్లు పడకుండా తనవంతు ప్రయత్నం చేశాడు. రాజపక్స (24), షనాకా (21), హసరంగ 10 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మొత్తానికి తక్కువ టార్గెట్ అయినా ఛేజింగ్‌లో లంక కాస్త ఇబ్బందులకు గురయ్యింది. 5 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది.