ఆసియా కప్ టోర్నీలో కీలకమైన సూపర్-4 మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ షకిబుల్ హసన్ ఫీల్డింగ్ ఎంచుకోగా, శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో శ్రీలంక జట్టు 9 వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది. 258 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లా జట్టు ఆదిలోనే కీలక వికెట్లను పోగొట్టుకుంది. ఈ క్రమంలో మహ్మద్ నియామ్ (21), హసన్ మీర్జా (28), లిట్టన్ దాస్ (15), షకీబుల్‌హసన్ (3), ముఫ్తీకర్ రహీమ్ (29), షమీమ్ హోసన్ (5), నసూమ్ అహ్మద్ (15), ఇస్లాం (7), టాస్కిన్ (1) పరుగులు చేయగా.. వీరిలో ఒకే ఒక్కడు తౌహిద్ హ్రిదోయ్ (82) పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే.. శ్రీలంకకు కాస్త గట్టి పోటీ ఇచ్చినట్టే ఇచ్చిన బంగ్లా జట్టు చివరికి 236 పరుగులుచేసి ఆల్ అవుటయ్యింది.
ఇక.. శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్లు పథుమ్ నిసాంక (40), దిముథ్ కరుణరత్నె (18) జట్టుకు శుభారంభాన్నందించారు. వన్‌డౌన్‌లో వచ్చిన వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ 73 బంతులెదుర్కొని 6 ఫోర్లు ఒక సిక్సర్‌తో అర్థసెంచరీతో రాణించాడు. సదీరా సమరవిక్రమ 72 బంతుల్లో 2 సిక్సులు, 8 ఫోర్లతో 93 పరుగులు చేయగా, అతడికి చరిత అసలంక(10), కెప్టెన్ దసన్ శనక(24) సహకారమందించడంతో 257 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగల్గింది. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహ్‌మూద్, తస్కిన్ అహ్మద్ మూడేసి వికెట్లు పడగొట్టగా, షొరిఫుల్ ఇస్లామ్ 2 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు..