Saturday, November 23, 2024

టీ20ల్లో శ్రీలంక రికార్డు, కెప్టెన్‌ దసున్‌ షనక వీరోచిత ఇన్నింగ్స్‌

అంతర్జాతీయ టీ20ల్లో శ్రీలంక సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20ల్లో అఖరి మూడు ఓవర్లలో అత్యధిక పరుగులు ఛేజ్‌ చేసిన తొలి జట్టుగా శ్రీలంక జట్టు నిలిచింది. పల్లెకెలె వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన అఖరి టీ20 మ్యాచ్‌లో శ్రీలంక సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. 177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక క్రమంగా వికెట్లు కోల్పోతూ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

17 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక స్కోరు 118/6. విజయానికి చివరి 3 ఓవర్లలో 59 పరుగులు కావల్సిన నేపథ్యంలో.. శ్రీలంక కెప్టెన్‌ దసున్‌ షనక విధ్వంసకర బ్యాటింగ్‌ చేశారు. 25 బంతుల్లో 4 సిక్సులు, 5 ఫోర్లతో 54 నాటౌట్‌గా నిలిచి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. వరుసగా 3 ఓవర్లలో 22, 18, 19 పరుగులు రాబట్టిన లంక 4 వికెట్ల తేడాతో గెలిపొందింది.

మిచిల్‌ మార్ష్‌కు గాయం..

ఆస్ట్రేలియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ మిచిల్‌ మార్ష్‌ గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కొలంబోలో శ్రీలంకతో జరిగిన రెండో టీ20 సమయంలో మార్ష్‌ వెన్ను నొప్పితో బాధపడ్డాడు. దీంతో పల్లెకెలె వేదికగా జరిగిన మూడో టీ20కి మార్ష్‌ దూరమయ్యాడు. అయితే అతడు గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు రెండు వారాలు సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డే పల్లెకెలె వేదికగా జాన్‌ 14న జరగనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement