Monday, November 25, 2024

దనుష్క గుణతిలకపై నిషేధం ఎత్తివేసిన శ్రీలంక క్రికెట్‌ బోర్డు

శ్రీలంక స్టార్‌ క్రికెటర్‌ దనుష్క గుణతిలకపై ఉన్న విధించిన నిషేధాన్ని లంక క్రికెట్‌ బోర్డు ఎత్తివేసింది. అత్యాచార వేధింపుల కేసులో గుణతిలక నిర్దోషిగా తేలడంతో శ్రీలంక క్రికెట్‌ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా గుణతిలకపై అత్యాచార వేధింపుల కేసు నమోదు అయింది. 29 ఏళ్ల మహిళ తనపై గుణతిలక అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో అతనిని ఆస్ట్రేలియా పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు లంక క్రికెట్‌ బోర్డు కూడా అతనిని సస్పెండ్‌ చేస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ ఆఫ్‌ న్యూ సౌత్‌ వేల్స్‌ అతడిని నిర్దోషిగా ప్రకటించింది. ఇప్పుడు గుణతిలక మళ్లి లంక జట్టులో ఆడవచ్చని లంక క్రికెట్‌ బోర్డు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ప్రపంచకప్‌లో అతను ఆడుతాడో లేదో చెప్పాలేము.

Advertisement

తాజా వార్తలు

Advertisement