Saturday, November 23, 2024

రెండో టీ20లో శ్రీలంక విజయం..సిరీస్‌ 1-1తో సమం..

కరోనా కలకలంతో ఒకరోజు ఆలస్యంగా జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా ఓటమి పాలైంది.  గత రాత్రి జరిగిన రీ షెడ్యూల్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు విజయం సాధించి సిరీస్ ను 1-1తో సమం చేసింది. సిరీస్ ఫలితాన్ని తేల్చే మూడో మ్యాచ్ నేడు జరగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. కొత్త కుర్రాళ్లు రుతురాజ్ గైక్వాడ్ (21), దేవదత్ పడిక్కల్ (29) పర్వాలేదనిపించినా నితీశ్ రాణా (9) సంజు శాంసన్ (7) దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్ ధావన్ 40 పరుగులు చేశాడు. శ్రీలంక బౌలర్లలో దనంజయ 2, చమీర, హసరంగ, దాసున్ శనక చెరో వికెట్ తీసుకున్నారు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన డి సిల్వను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది.

సమాధానంగా శ్రీలంక మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. లంక విజయంలో మినోద్ భానుక (36), ధనంజయ డి సిల్వా (40-నాటౌట్) ప్రధాన భూమిక పోషించారు. అవిష్క ఫెర్నాండో 11, హసరంగ 15, చమిక కరుణరత్నె 12 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్, చేతన్ సకారియా, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ చెరో వికెట్ తీసుకున్నారు. ఇక సిరీస్ లో తదుపరి మ్యాచ్ ఇవాళ జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారినే సిరీస్ విజయం వరిస్తుంది.

ఇది కూడా చదవండి :టోక్యో ఒలింపిక్స్‌:పతకానికి చేరువలో పి.వి.సింధు..

Advertisement

తాజా వార్తలు

Advertisement