శ్రీలంక టూర్లో భారత జట్టు మూడో టీ20 ఆడుతోంది. వర్షం రాకతో టాస్ ఆలస్యం అయ్యింది. ఇక.. టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకుంది. కాగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు వెంటవెంటనే వికెట్లను కోల్పోయింది. ఇప్పటికే రెండు టీ20లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న భారత జట్టుకు ఈ మ్యాచ్ నామమాత్రంగానే మారింది. కాగా, పరువు కోసం పోరాడనున్న లంక ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ఇప్పటికే టీ20 సిరీస్ గెలుపొందిన భారత జట్టు నాలుగు మార్పులు చేసింది. కీలక ఆటగాళ్లు అయిన హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్‌లకు విశ్రాంతినిచ్చింది.
పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండడంతో భారత బ్యాట్స్‌మన్ పరుగులు తీయడానికి ఇబ్బంది పడ్డారు. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేయగలిగారు. శ్రీలంక 138 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగింది.