మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం టీమిండియా ఉమెన్స్ జట్టు ఇప్పటికే శ్రీలంక చేరింది. రణ్‌గిరి డంబెల్లా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరుగనుంది. అటు ఆతిథ్య శ్రీలంక, ఇటు పర్యాటక భారత మహిళా జట్టుకు వచ్చే కామన్వెల్త్ గేమ్స్‌కు ఈ టోర్నీ ఎంతో దోహదపడనుంది. ఇటీవల న్యూజిలాండ్‌తో టీ20 ఆడిన టీమిండియా జట్టు నేడు శ్రీలంకతో తలపడనుంది. 50 ఓవర్ల వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు కూడా ఈ టూర్ టీమిండియాకు కలిసొచ్చే అంశమని హెడ్ కోచ్ రమేష్ పొవార్ వ్యాఖ్యానించారు.
భారత మహిళా దిగ్గజ క్రికెటర్ మిథాలీరాజ్ లేకుండా హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా జట్టు శ్రీలంకకు చేరింది. షఫాలీ వర్మ, సృతి మందన ఓపెనర్లగా బరిలోకి దిగనున్నారు. ఇక మిడిలార్డర్ బ్యాటర్స్‌లో జెమిమహ్ రొడ్రిగ్యూస్, సబ్బినేని మేఘనా తదితరులు అద్భుతంగా రాణిస్తున్నారు. జూన్ 27న ఆఖరి టీ20 మ్యాచ్ అనంతరం జులై 1 నుంచి 7 వరకు పల్లెకెల్లె స్టేడియంలో మూడు వన్డేల మ్యాచ్‌ల సిరీస్ శ్రీలంకతో టీమిండియా ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత్, శ్రీలంక బోర్డుల జట్లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.