స్వదేశంలో ఆస్ట్రేలియాతో శ్రీలంక తలపడేందుకు శ్రీలంక సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌కు 21 మంది సభ్యులతో కూడిన టీంను ప్రకటించింది. గాయం కారణంగా జింబాబ్వేతో జరిగిన సిరీస్‌కు దూరమైన స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ తిరిగి జట్టులోకి వచ్చాడు. అదేవిధంగా శ్రీలంక అండర్ 19 జట్టు కెప్టెన్ దునిత్ వెల్లలగే సీనియర్ జట్టు తరఫున క్రీజులోకి అడుగిడనున్నాడు. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల వన్ డే సిరీస్‌లో లంక టీం తలపడనుంది. పల్లెలెకే స్టేడియం వేదికగా వచ్చే నెల 14న ఇరుజట్ల మధ్య తొలి వన్‌డే జరగనుంది.
ప్రస్తుతం జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ 20 సిరిస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆసిస్..కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో చివరి మ్యాచ్ శనివారం పల్లెలెకె స్టేడియం వేదికగా జరుగుతుంది. ఇక కొలంబో జట్టు వివరాలు ఇలా ఉన్నాయి. దసున్ షనక, పాతుం నిస్సాంక, ధనుష్క గుణతిలక, కుసల్ మెండిస్, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దినేష్ చండిమాల్, భానుక రాజపక్ష, నిరోషన్ డిక్వెల్లా, వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత్ చమీర, అసిత రమేశ్, తుషార జయవిక్రమ, జెఫ్రీ వాండర్సే, లహిరు మధుశంక, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మధుషన్.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.