Saturday, November 23, 2024

శ్రీ‌లంక క్రికెట్‌: ఆట‌గాళ్ల జీతాల్లో 35 శాతం కోత

శ్రీ‌లంక క్రికెట్‌ లో ఆటగాళ్ల జీతం క్రికెట్ మ్యాచ్ లపై పడనుంది.. ఈ మధ్యే ఆట‌గాళ్ల జీతాల్లో 35 శాతం కోత విధిస్తూ శ్రీ‌లంక క్రికెట్ బోర్డ్ నిర్ణ‌యం తీసుకొన్న‌ది. దాంతో కెప్టెన్ క‌రుణ‌ర‌త్నే, మాథ్యూస్ సహా సీనియర్ క్రికెటర్లు ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించారు. కొద్ది రోజుల క్రితం శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) క్రీడాకారుల జీతం 35 శాతం తగ్గించాలని నిర్ణయించింది. కొత్త ఒప్పందం ప్రకారం వికెట్ కీపర్లు నిరోషన్ దిక్వేలా, ధనంజయ్ డి సిల్వా మాత్ర‌మే ల‌బ్ధి పొంద‌నున్నారు. బోర్డు వీరిని టాప్ క్యాట‌గిరిలో వేసింది. ఈ ఇద్దరు ఆటగాళ్ల నెలసరి జీతం దాదాపు రూ.73 లక్షలుగా ఉంటుంది. దీంతో కెప్టెన్ దిముత్ కరుణరత్నే, ఏంజెలో మాథ్యూస్, సురంగ లక్మల్, దినేష్ చండిమల్ సహా పలువురు సీనియర్ క్రికెటర్లు కేంద్ర ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు బంగ్లాదేశ్ పర్యటనను సస్పెన్స్ లో పడేసింది. మే 23 నుంచి బంగ్లాదేశ్ లో ఈ జట్టు 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడవలసి ఉన్న‌ది. దీంతో బంగ్లాదేశ్ వ‌న్డే సిరీస్‌పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement