ఐపీఎల్ 17వ సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. ఈసారి మొదటి నుంచే ధనాధన్ టోర్నీ క్రికెట్ ప్రేమికులకు ఫుల్ మజా అందిస్తోం ది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024లో ఇప్పటివకరకు 17 మ్యాచ్‌లు మాత్రమే జరిగా యి. కానీ అందులో రెండు మ్యాచ్‌లు చాలా ప్రత్యుకంగా నిలిచాయి. ఆ మ్యాచుల్లో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లు (277, 272) నమోదయ్యాయి. ఆ రెండు అత్యధిక స్కోర్లు కూడా తెలుగు గడ్డపైనే నమోదవడం మరో విశేషం. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 277 పరుగులు సాధించగా.. వైజాగ్ వేదికగా ఢిల్లి క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 272 పరుగులు చేసింది. మరికొన్ని జట్లు కూడా 200 ప్లస్ పరుగులు సాధించి ఈ సీజన్ ఐపీఎల్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి.
హైదరాబాద్: ఉప్పల్ స్టేడి యం వేదికగా మరో హై వోల్టేజ్ మ్యాచ్‌కి రంగం సిద్ధమైంది. నేడు సన్‌రైజర్స్ హైదరా బాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ముందుగా టాప్ గెలిచి సన్ రైజర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.. మరికొద్ది సేపటిలో సి ఎస్ కె. బ్యాటింగ్ కు దిగనుంది.
ఇది ఇలా ఉంటే సొంతగడ్డపై జరిగిన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దు గా చెలరేగి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. టోర్నీ టాప్ స్కోరు నమోదు చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. అదే జోష్‌తో ఇప్పు డు మరో కీలక పోరుకు రెడీ అయ్యారు. పటిష్ట మన డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నా రు. హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ సూపర్ ఫామ్‌లో ఉండటం ఎస్‌ఆర్ హెచ్‌కు ప్లస్ పాయింట్. వీరితో పాటు ట్రావిస్ హెడ్, అబ్దుల్ సమద్, మార్క్‌రమ్, షాబాద్ అహ్మద్ లు కూడా దూకుడైన బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తున్నారు. ఇక మయాంక్ అగర్వా ల్ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. వీరంద రూ కలిసికట్టుగా రాణిస్తే చెన్నైపై కూడా భారీ స్కోరు సాధించడం ఖాయం. ఇక బౌలింగ్ విష యానికి వస్తే ఇక్కడ ఎస్‌ఆర్‌హెచ్ చాలా వీక్‌గా ఉంది. ఈ విభాగంలో హైదరాబా ద్ మెరుగు పడాల్సిన అవసరం ఉంది. ప్రధాన బౌలర్లు ధారళం గా పరుగు లు సమర్పించు కుంటున్నా రు. కీలక సమయాల్లో వికెట్లు తీయలె క పోతున్నారు. దాంతో సన్‌రైజ ర్స్ చివరి క్షణాల్లో కొద్ది పరుగుల తేడాతో ఓటము లను చవిచూస్తోం ది. ఈసారి బౌలర్లు పుంజు కుంటే ఎస్‌ఆర్‌హెచ్‌కు ఎదురే ఉండదు. హైదరా బాద్ మూడు మ్యాచు ల్లో ఒక్కటే విజయం సాధించింది.
మరో వైపు చెన్నై జట్టు మూ డు మ్యాచుల్లో రెండు విజయాలు సాధించి ఒక మ్యాచ్ లో ఓడిం ది. ఇప్పుడు సన్‌రైజ ర్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో మళ్లి ముం దుకు దూసు కెళ్లాలని చూ స్తోంది. సీఎస్‌కేలో అనుభా జ్ఞులైన ప్లేయ ర్లకు కొదువలేదు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభా గాల్లో సీఎస్‌కే ఐపీఎల్‌లో అత్యుత ్తమ జట్ల లో ఒకటిగా ఉంది. ఇప్పుడు హైదరాబా ద్‌తో అమీతుమీ తేల్చుకోవ డానిక రెడీ అయిం ది. దాంతో ఈరోజు ఉప్పల్ లో జరిగే మ్యాచ్ హోరాహో రీగా జరగడం ఖాయమనిపిస్తోంది.
జట్ల వివరాలు (అంచనా)
సన్‌రైజర్స్ హైదరాబాద్: పాట్ కమిన్స్ (కెప్టెన్), అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, మయాంక్ అగర్వాల్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఎయిడన్ మార్క్‌రమ్, భువనేశ్వర్ కుమార్, జయ్‌దేవ్ ఉనద్కాట్, షాబాజ్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్.
సీఎస్‌కే: రుతురాజ్ గైక్వా డ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వీ, ఎమ్‌ఎస్ ధోనీ, దీపక్ చాహర్, తుషార్ పాండే, మతీషా పతిర ణ, శార్దుల్ ఠాకూర్, శివం దూబే.
నేటి మ్యాచ్ కు రేవంత్ రెడ్డి ..
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు జరినే మ్యాచ్ చూడ్డానికి కుటుంబ సమేతంగా వెళ్ళనున్నారు. ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ జట్టును ఎంకరేజ్ చేయనున్నారు సీఎం. గతంలో సీఎం హోదాలో ఉప్పల్ స్టేడియంకు కేసీఆర్ కూడా వెళ్ళారు. 9ఏళ్ల కిందట ఇండియా, శ్రీలంక మ్యాచ్‌ను ఆయన చూశారు. ఇప్పుడు సీఎం హోదాలో రేవంత్ మొదటిసారి ఉప్పల్ స్టేడియానికి వెళుతున్నారు. సీఎం రేవంత్ కూడా మ్యాచ్‌కు వస్తుండటంతో ఫ్యాన్స్‌లో జోస్ మరింత పెరిగింది.
విద్యుత్ పునరుద్దరణ
మరోవైపు ఉప్పల్ స్టేడియానికి ఉన్న కరెంట్ కష్టాలు తొలిగిపోయాయి. బిల్లులు కట్టలేదని అధికారులు తొలగించిన కరెంట్‌ను తిరిగి పునరుద్ధరించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు విద్యుత్ అధికారులతో సంప్రదింపులు జరిపిన తర్వాత విద్యుత్‌ను పునరుద్ధరించారు. ఐపీఎల్ మ్యాచ్‌ను దీష్టిలో ఉంచుకుని బిల్లులు చెల్లించేందుకు విద్యుత్ అధికారులు ఒక రోజు గడువు ఇచ్చినట్లు సమాచారం ..ది. దీంతో సన్‌రైజర్స్, సీఎస్‌కే మ్యాచ్‌కు లైన్ క్లియర్ అయ్యింది.