Tuesday, November 26, 2024

SRH V GT – టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న స‌న్ రైజ‌ర్స్..

గుజ‌రాత్ టైటాన్స్ మ‌రికొద్ది సేప‌టిలో ఢీ
నేటి మ‌ధ్యాహ్నం ఆహ్మాదాబాద్ మ్యాచ్
మ‌రోసారి భారీ స్కోర్ పై స‌న్ రైజ‌ర్స్ క‌న్ను
గుజ‌రాత్ ఆశ‌ల‌న్నీ గిల్ పైనే

గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందుగా బౌలింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌కు తమ తుది జట్టులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎలాంటి మార్పులు చేయలేదు. కానీ గుజరాత్ మాత్రం రెండు మార్పులు చేసింది. స్పెన్సర్ జాన్సన్ స్థానంలో నూర్ అహ్మద్, సాయి కిషోర్ స్థానంలో దర్శన్ నల్కండేను జట్టులోకి తీసుకున్నట్టు టాస్ సమయంలో కెప్టెన్ గిల్ చెప్పాడు.ఈ మ్యాచ్ అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్డేడియంలో మద్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుంది.

చెన్నై చేతిలో పరాజయం తరువాత ముంబై ఇండియన్స్‌పై గెలిచిన గుజరాత్ టైటాన్స్‌కు ముంబై ఇండియన్స్‌పై భారీ స్కోరుతో విజయం సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మద్య జరగనుంది. రెండు జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడి ఒక్కో మ్యాచ్ గెలిచి మూడో మ్యాచ్‌లో పరస్పరం తలపడనున్నాయి.
మొదటి మ్యాచ్‌లో ఓడినా చివరి బంతి వరకూ పోరాడి 204 పరుగుల చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింంగ్ లో విధ్వంసం రేపుతోంది. ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో ఆ జట్టు క్రికెటర్లు బ్యాటింగ్ చూస్తే అదే అన్పిస్తుంది. 277 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్ది ముందు ఉంచారు. హెన్రిచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, , ఎయిడెన్ మార్క్‌రమ్‌ల విధ్వంసకర ఆటతో ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉందని చెప్పవచ్చు. ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్ తదితర బౌలర్లు మాత్రం ఇంకా చాలా మెరుగుపడాల్సి ఉంది. ఓవర్లు పొదుపుగా చేయగలిగితే మంచి ఫలితాలుంటాయి.

రెండు జట్లలో ట్రేవిస్ హెడ్ , అభషేక్ శర్మ, శుభమన్ గిల్, సాయి సుదర్శన్ బ్యాటింగ్ ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు హెన్రిచ్ క్లాసెన్ మంచి ఆయుధంలా మారాడు. తొలి రెండు మ్యాచ్ లలో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. కేకేఆర్‌పై 29 బంతుల్లో 63 పరుగులు చేస్తే ముంబైపై 34 బంతుల్లో 80 పరుగులు చేశాడు. ఇక గుజరాత్ టైటాన్స్ జట్టు శుభమన్ గిల్‌పై భారీగా ఆశలు పెట్టుకుంది.

గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ 11 అంచనా
వృద్ధిమాన్ సాహా, శుభమన్ గిల్, అజ్మతుల్లా ఓమర్జాయ్, దేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిశోర్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మ, స్పెన్సర్ జాన్సన్

- Advertisement -

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11
మయాంగ్ అగర్వాల్, ట్రేవిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఎయిడెన్ మార్క్‌రమ్, హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, జయదేవ్ ఉనద్కత్

Advertisement

తాజా వార్తలు

Advertisement