Friday, November 22, 2024

ఓట‌మి దిశ‌గా స‌న్ రైజ‌ర్స్ …అదిల్ ర‌షిద్ ఔట్ – 81/7

స‌న్ రైజ‌ర్స్ ఓట‌మి దిశ‌గా ప‌య‌నిస్తున్న‌ది.. 204న ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ్యాటింగ్ దిగిన స‌న్ రైజ‌ర్స్ తొలి నుంచి వికెట్లు కొల్పోతూ వ‌చ్చింది.. తొలి ఓవ‌ర్లోనే రెండు వికెట్లు కోల్పోయిన ఎస్ ఆర్ హెచ్ ఆ త‌ర్వాత ఏ ద‌శ‌లోనూ కోలుకోలేక‌పోయింది.. వ‌రుస‌గా వికెట్లు కోల్పోతూ తొలి ప‌రాజ‌యానికి ద‌గ్గ‌ర‌వుతున్న‌ది. హైద‌రాబాద్ ఉప్ప‌ల్ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఐపిఎల్ 2023 టోర్నిలో భాగంగా నేడు స‌న్ రైజ‌ర్స్ తో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ త‌ల‌ప‌డుతున్న‌ది.. ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజ‌స్థాన్ రాయ‌ల్స్ భారీ స్కోర్ చేసింది.. నిర్ధారిత 20 ఓవ‌ర్ల‌లో అయిదు వికెట్ల న‌ష్టానికి 203 ప‌రుగులు చేసింది.. గెలుపు కోసం స‌న్ రైజ‌ర్స్ 204 పరుగులు చేయ‌వ‌ల‌సి ఉంది.. ప్ర‌స్తుతం ఏడు వికెట్ రూపంలో రషిద్ అవుట‌య్యాడు..ఈ వికెట్ య‌జువేంద్ర చావ‌ల్ కు ల‌భించింది.. అదిల్ 18 ప‌రుగులు చేశాడు. మ‌యాంక్ అగ‌ర్వాల్ ను ఆరో వికెట్ రూపంలో య‌జువేంద్ర ప‌డ‌గొట్టాడు.. మ‌యాంక్ 27 ప‌రుగులు చేశాడు.. ఇక అయిదో వికెట్ గ. గ్లెన్ ఫిలిప్స్ ను అశ్వీన్ అవుట్ చేశాడు.. ఫిలిప్స్ కేవలం 8పరుగులు చేశాడు . ఇక నాలుగో వికెట్ రూపంలో వాషింగ్ట‌న్ సుంద‌ర్ ను జాస‌న్ హోల్డ‌ర్ అవుట్ చేశాడు. అంతుకు ముందు హ్యారీ బ్రూక్ 13 ప‌రుగులు చేసి యుజువేంద్ర చావ‌ల్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు..ఇక ఓపెన‌ర్ అభిషేక్ ను, వ‌న్ డౌన్ బ్యాట్స్ మెన్ రాహుల్ త్రిఫాటిని తొలి ఓవ‌ర్ లోనే బౌల్ట్ పెవిలియన్ కు చేర్చాడు.. ప్ర‌స్తుతం అబ్దుల్ సమద్ , అదిల్ రషిద్ తో క్రీజ్ లో ఉన్నారు..12 ఓవ‌ర్లు ముగిసే స‌రికి స‌న్ రైజ‌ర్స్ 6 వికెట్ల న‌ష్టానికి 55 ప‌రుగులు చేసి పీక‌లోతు క‌ష్టాల‌లో ప‌డింది.

కాగా, రాజ‌స్థాన్ బ్యాటింగ్ లో స్కిప‌ర్ సంజు శాంస‌న్ 55 ప‌రుగులు చేసి న‌ట‌రాజ‌న్ బౌలింగ్ లో అయిదో వికెట్ గా వెనుతిరిగాడు… ఇందులో రెండు ఫోర్లు, నాలుగు సిక్స్ లు ఉన్నాయి.. ఇక అంత‌కు ముందు రియాగ్ పరాగ్ ఏడు ప‌రుగులు చేసి న‌ట‌రాజ్ బౌలింగ్ లో ఔట‌య్యాడు.. దేవ‌ద‌త్త ప‌డిక్క‌ట్ మూడో వికెట్ రూపంలో ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో ఔట‌య్యాడు.. ప‌డిక్క‌ల్ కేవ‌లం 2న ప‌రుగులు మాత్ర‌మే చేశాడు.. అలాగే ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైశ్వాల్ 54 పరుగులు చేసి ఫారూఖీ బౌలింగ్ లో ఔటయ్యారు.. కాగా జైశ్వాల్ ఈ సీజ‌న్ లో ఆడిన తొలి మ్యాచ్ లోనే 34 బంతుల‌లో 50 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు.. ఈ ప‌రుగుల‌లో8 ఫోర్లు ఉన్నాయి. ఇక‌ బట్లర్ రూపంలో తొలి వికెట్ కొల్పోయింది.. బట్లర్ వికెట్ ను ఫరూఖీ పడగొట్టారు.. బట్లర్ 22 బంతులలో 54 పరుగులు చేశాడు. ఇందులో ఏడు ఫోర్లు, నాలుగు సిక్స్ లు ఉన్నాయి. అశ్వీన్ 3 , హెట్మెయిర్ 22 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచారు.. న‌ట‌రాజన్, ఫారూఖీ రెండేసి వికెట్లు తీసుకోగా, ఉమ్రాన్ మాలిక్ కు ఒక వికెట్ ద‌క్కింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement