Sunday, November 24, 2024

Sports – తొలిసారి అసియా విజేతగా భారత మహిళా జట్టు

బ్యాడ్మింటన్ ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్ విజేతగా భారత మహిళల జట్టు నిలిచింది. మలేషియాలోని సెలంగోర్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్ జట్టును భారత్ 3-2 తేడాతో ఓడించి చరిత్ర సృష్టించింది.
క్రీడా చరిత్రలో ప్రతిష్టాత్మకమైన కాంటినెంటల్ టీమ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను భారత్ గెలుచుకోవడం ఇదే తొలిసారి.

భారత బ్యాడ్మింటన్ స్టార్‌లు పీవీ సింధు, గాయత్రి గోపీచంద్-ట్రీసా జాలీ జోడీ, టీనేజ్ సంచలనం అన్మోల్ ఖర్బ్ లు తమ తమ మ్యాచుల్లో గెలుపొందారు. థామస్ కప్‌ను గెలుచుకున్న రెండేళ్ల తరువాత ఖండాంతర టోర్నమెంట్‌లో భారత్ అద్భుతంగా రాణించి చైనా, హాంకాంగ్, జపాన్, చివరికి థాయ్‌లాండ్‌లను ఓడించి కప్పును గెలుచుకుంది

Advertisement

తాజా వార్తలు

Advertisement