Friday, November 22, 2024

రైనాకు స్పోర్ట్స్ ఐకాన్‌ అవార్డు.. 16 మంది పోటీపడగా, రైనాకే దక్కింది..

ఐపీఎల్‌లో అమ్ముడు పోని ఆటగాడిగా సురేష్‌ రైనా నిలిచిపోయాడు. అయితేనేం.. ఓ అరుదైన గౌరవం సంపాధించుకున్నాడు. దిగ్గజ ఆటగాడు రైనాకు.. మాల్దీవుల ప్రభుత్వం ఇచ్చే ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ ఐకాన్‌ అవార్డు వరించింది. ఈ అవార్డు కోసం 16 మంది అంతర్జాతీయ ఆటగాళ్లు పోటీ పడ్డారు. చివరికి సురేష్‌ రైనాకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు కోసం పోటీపడిన వారిలో శ్రీలంక క్రికెట్‌ దిగ్గజ ఆటగాడు సనత్‌ జయసూర్య, జమైకా స్ప్రింటర్‌ పోవెల్‌, డచ్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు ఎడ్గర్‌ డెవిడ్స్‌ వంటి దిగ్గజాలు ఉన్నారు.

17వ తేదీన మాల్దీవ్స్ లోని సింథటిక్‌ రన్నింగ్‌ ట్రాక్‌ మైదానంలో ఈ అవార్డు వేడుక జరిగింది. బంగ్లాదేశ్‌ క్రీడా శాఖ మంత్రి జహీర్‌ హసన్‌ రసెల్‌ చేతుల మీదుగా రైనా ఈ స్పోర్ట్స్ ఐకాన్‌ అవార్డును అందుకున్నాడు. కార్యక్రమంలో సౌదీ అరేబియా, మాల్దీవుల క్రీడా శాఖ మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ మెగా వేలంలో సురేష్‌ రైనాను ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఇష్టపడలేని విషయం తెలిసిందే..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement