Friday, January 17, 2025

Sports Awards – ఖేల్‌రత్న పురస్కారాలను ప్రదానం చేసిన రాష్ట్రపతి

గుకేష్,మ‌ను బాక్,హ‌ర్మ‌న్ ప్రీత్,ప్ర‌వీణ్ కు ఖేల్ ర‌త్న‌
తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు జివాంజీ దీప్తీ,జ్యోతి య‌ర్రాజీల‌కు అర్జున్ పుర‌స్కారాలు
మొత్తం 32 మందికి అర్జున్ అవార్డులు
ఇద్ద‌రు కోచ్ ల‌కు ద్రోణాచార్య పుర‌స్కారాలు
మ‌రో ఇద్ద‌రు సీనియ‌ర్లకు లైఫ్ టైమ్ అవార్డులు

న్యూ ఢిల్లీ – ఈ ఏడాది ఖేల్ ర‌త్న అవార్డుల ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మం నేడు ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ లో వైభ‌వంగా జరిగింది.. అవార్డు గ్ర‌హీత‌లు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా అవార్డులు స్వీక‌రించారు.. ప్ర‌పంచ చెస్ ఛాంపియ‌న్ డి.గుకేశ్ , హాకీ స్టార్ హర్మన్‌ప్రీత్‌ సింగ్ , పారా అథ్లెట్‌ ప్రవీణ్‌ కుమార్ , షూటింగ్‌లో డబుల్ ఒలింపిక్‌ పతక విజేత మను బాకర్ లు ఖేల్ ర‌త్న అవార్డులు స్వీక‌రించారు.

తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారిణులు జివాంజీ దీప్తి (పారా అథ్లెటిక్స్‌), జ్యోతి యర్రాజీ (అథ్లెటిక్స్‌) లు ప‌ద్మ‌శ్రీ పురస్కారాలు అందుకున్నారు.. వారితో పాటు మరో 32 మంది అర్జున, ఐదుగురు ద్రోణాచార్య పురస్కారాలు అందుకున్నారు. లైఫ్‌టైం కేటగిరీలో.. మురళీధరన్‌ (బ్యాడ్మింటన్‌), అర్మాండో ఆగ్నెలో కొలాకో (ఫుట్‌బాల్‌) పురస్కారాలు స్వీకరించారు.

- Advertisement -

అర్జున అవార్డులు అందుకుంది వీరే.

అన్ను రాణి (అథ్లెటిక్స్‌, నీతూ (బాక్సింగ్‌), స్వీటీ బురా (బాక్సింగ్‌), వంతిక అగర్వాల్‌ (చెస్‌);, సలీమా (హాకీ), అభిషేక్‌ (హాకీ), సంజయ్‌ (హాకీ);, జర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (హాకీ), సుఖ్‌జీత్‌ సింగ్‌ (హాకీ), స్వప్నిల్‌ సురేష్‌ కుసాలే (షూటింగ్‌), సరబ్‌జోత్‌ సింగ్‌ (షూటింగ్‌), అభయ్‌ సింగ్‌ (స్క్వాష్‌), సజన్‌ ప్రకాశ్‌ (స్విమ్మింగ్‌), అమన్‌ (రెజ్లింగ్‌), రాకేశ్‌ కుమార్‌ (పారా ఆర్చర్‌), ప్రీతి పాల్‌ (పారా అథ్లెటిక్స్‌), అజీత్‌సింగ్‌ (పారా అథ్లెటిక్స్‌), సచిన్‌ సర్జేరావు ఖిలారి (పారా అథ్లెటిక్స్‌), ప్రణవ్‌ సూర్య (పారా అథ్లెటిక్స్‌), హెచ్‌. హోకాటో సీమ (పారా అథ్లెటిక్స్‌), సిమ్రాన్‌ (పారా అథ్లెటిక్స్‌), నవ్‌దీప్‌ (పారా అథ్లెటిక్స్‌), నితీశ్ కుమార్‌ (పారా బ్యాడ్మింటన్‌), తులసీమతి మురుగేశన్‌ (పారా బ్యాడ్మింటన్‌), నిత్యశ్రీ సుమతి శివన్‌ (పారా బ్యాడ్మింటన్‌), మనీశా రాందాస్‌ (పారా బ్యాడ్మింటన్‌), కపిల్‌ పర్మార్‌ (పారా జూడో), మోనా అగర్వాల్‌ (పారా షూటింగ్‌), రుబినా ఫ్రాన్సిస్‌ (పారా షూటింగ్‌),

అర్జున అవార్డ్స్‌ (లైఫ్‌టైమ్‌)- సుచా సింగ్‌ (అథ్లెటిక్స్‌), మురళీకాంత్‌ రాజారాం పెట్కర్‌ (పారా స్విమ్మింగ్‌)

ద్రోణాచార్య అవార్డులు (కోచ్‌లు) – సుభాష్‌ రాణా (పారా షూటింగ్‌), దీపాలీ దేశ్‌పాండే (షూటింగ్‌), సందీప్‌ సంగ్వాన్‌ (హాకీ)

Advertisement

తాజా వార్తలు

Advertisement