Friday, November 22, 2024

Special Meet – మోడీతో ఒలింపిక్స్ బృందం భేటి….

పారిస్‌ ఒలింపిక్స్ లో భారత్‌ తరఫున ప్రాతినిధ్యం వహించిన అథ్లెట్ల బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అభినందించారు. ఎర్ర‌కోట‌లో జ‌రిగిన స్వాతంత్ర్య దినోత్స‌వ వేడ‌క‌ల‌కు అతిథులుగా హ‌జరైన పారిస్ ఒలింపిక్స్ భార‌త బృందం క్రీడాకారులు నేటి మ‌ధ్యాహ్నం ప్రధాని నివాసంలో క‌లిసారు.. ఈ సందర్భంగా షూటర్‌ మను బాకర్ ఒలింపిక్‌ పతకం సాధించిన తన పిస్టల్‌ను ప్రధానికి చూపించింది. ఈ పిస్ట‌ల్ తోనే ప‌త‌కాలు సాధించ‌నంటూ ప్ర‌ధానికి వివ‌రించింది..

ఇక ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి కాంస్యం సాధించిన భారత హాకీ పురుషుల జట్టు ప్రధానికి ప్రత్యేక కానుకనిచ్చింది. జట్టు ఆటగాళ్లంతా సంతకం చేసిన ఓ జెర్సీ, హాకీ స్టిక్‌ను మోడీకి అందించారు. ఒలింపిక్స్‌లో కాంస్యం అందుకున్న రెజ్లర్‌ అమన్‌ సెహ్రావత్‌ కూడా భారత జెర్సీని ప్రధానికి బహుమతిగా ఇచ్చారు. అనంతరం ప్రధాని క్రీడాకారుల మధ్య కలియ దిరుగుతూ వారితో సంభాషించారు.

ఒలింపిక్స్‌లో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ”పారిస్‌ ఒలింపిక్స్‌లో ఈ యువ ఆటగాళ్లు మన జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు. 140 కోట్ల మంది భారతీయుల తరఫున మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. మరిన్ని కొత్త కలలు, ఆశయాలతో ముందుకెళ్దాం. వాటికి సాకారం కోసం నిరంతరం కృషి చేద్దాం” అని క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ, భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉష పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement