లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా గట్టి పోటీనిచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైన ప్రోటీస్ 161 పరుగుల ఆధిక్యత సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లండ్ 93 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో ఇంగ్లండ్ చావు దెబ్బతిన్నట్టయ్యింది. అంతకు ముందు దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 165 పరుగులకే కుప్పకూలింది.
ఇదిలా ఉండగా తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ దురదృష్టకర రీతిలో ఔటయ్యాడు. 47 పరుగులతో నిలకడగా ఆడుతున్న ఎల్గర్‌ను లైన్ లెంగ్త్ బౌల్‌తో జేమ్స్ అండర్సన్ బోల్తా కొట్టించాడు. ప్రోటిస్ ఇన్నింగ్స్ 23 ఓవర్లో జేమ్స్ అండర్సన్ వేసిన బంతిని ఎల్గర్ లెగ్ సైడ్ డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే బంతి నేరుగా తన థైప్యాడ్‌కు తగిలి వికెట్లపైకి దూసుకెళ్లింది. ఎల్గర్ బంతిని ఆపే ప్రయత్నం చేసినా అప్పటికే అది వికెట్లను గిరాటేసింది.