సౌతాఫ్రికా విధ్వంసక ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి క్రికెట్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. సుదీర్ఘమైన ఫార్మాట్‌కు వీడ్కోలు పలుకుతూ రిటైర్మెంట్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని క్లాసెన్ చెప్పాడు. మొత్తానికి తన నిర్ణయం చాలా కఠినంగా ఉందని, తనకు ఇష్టమైన ఫార్మాట్ ను సగంలోనే వదిలేయడం చాలా బాధగా ఉందన్నారు.
2019లో టెస్టు ఫార్మాట్లోకి అడుగుపెట్టిన క్లాసెన్ దక్షిణాఫ్రికా తరఫున నాలుగు టెస్టులు మాత్రమే ఆడాడు. క్లాసెన్ 4 టెస్ట్‌ల్లో కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే 10 క్యాచ్‌లు, 2 స్టంపౌట్లు చేశాడు.