Wednesday, November 20, 2024

Breaking | సౌతాఫ్రికా V/s భారత్.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరంటే

భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. సౌతాఫ్రికాలోని సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ వేశారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. పర్యాటక జట్టు భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.

- Advertisement -

కెప్టెన్లు ఏమన్నారంటే..
జట్టులో ఎలాంటి మార్పులు లేవని, తొలి టీ20 ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్నామని టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అన్నారు. టాస్ గెలిస్తే తాము కూడా మొదట బ్యాటింగ్ చేయాలని భావించామని, ఈ మ్యాచ్‌లో దూకుడుగా ఆడతామని చెప్పాడు. గత మ్యాచ్‌లో ప్రదర్శన విషయంలో సంతృప్తిగా ఉన్నామని సూర్య చెప్పాడు. ప్రతి మ్యాచ్‌లో ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటామని, సానుకూల అంశాలను కొనసాగించాలని భావిస్తున్నామని చెప్పాడు. ఇక దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ మాట్లాడుతూ.. క్రుగర్ స్థానంలో హెండ్రిక్స్‌ను జట్టులోకి తీసుకున్నామని చెప్పాడు. తొలి టీ20 ఫలితం గురించి ఆలోచించడం లేదని అన్నాడు. పిచ్‌పై తేమను బౌలర్లు ఉపయోగించుకుంటారని భావిస్తున్నామని, అందుకే బౌలింగ్ ఎంచుకున్నట్టు మార్క్రమ్ చెప్పాడు.

తుది జట్లు ఇవే..
భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, అవేశ్ ఖాన్.

దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో యన్‌సెన్, ఆండిల్ సిమెలన్, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, పీటర్.

Advertisement

తాజా వార్తలు

Advertisement