దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ లు దేశంలోనే జరుగుతాయా.. ఎక్కడ జరుగుతాయనేదానిపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ మరోసారి స్పష్టతనిచ్చారు. అయితే ఐపీఎల్-2022 ఇండియాలో జరుగుతుందని సౌరభ్ గంగూలీ తెలిపారు. కరోనా పరిస్థితి చేయిదాటితే తప్ప ఈ సారి ఐపీఎల్‌ను ఇండియాలోనే నిర్వహిస్తామని తెలిపారు. ముంబై, పూణెలలో లీగ్ మ్యాచ్‌లను జరుపుతామని… అహ్మదాబాద్ వేదిక గురించి ఇంకా ఆలోచించలేదని పేర్కొన్నాడు. ఏప్రిల్, మే నెలల్లో ఇండియాలో కరోనా కేసుల ఉధృతి ఎలా ఉంటుందో చూసి.. పరిస్థితులకు అనుగుణంగా తాము ఐపీఎల్ నిర్వహణలో మార్పులపై నిర్ణయం తీసుకుంటామని గంగూలీ తెలిపాడు. కరోనా కారణంగా గత రెండు సీజన్లను యూఏఈ వేదికగా నిర్వహించారు. దుబాయ్, అబుదాబీ, షార్జా వేదికలలో మ్యాచ్‌లను ఏర్పాటు చేశారు. ఆటగాళ్లు, సిబ్బంది బయోబబుల్ ఉంటూ ఐపీఎల్ ఆడాల్సి వచ్చింది. అయితే సొంతగడ్డపై ఆడుతున్న మజాను ఐపీఎల్ ఫ్రాంచైజీలు అందించలేకపోయాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement