చైనాలోని హాంగ్‌జౌలో జరగనున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల సాఫ్ట్‌బాల్ జట్టు అరంగేట్రం చేయనుంది. ఇందుకోసం 16 మంది సభ్యులతో కూడిన జట్టును సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఎఐ) సోమవారం ప్రకటించింది. సెప్టెంబర్ 23న ప్రారంభమయ్యే కాంటినెంటల్ ఈవెంట్‌కు ఒక స్టాండ్‌బై ప్లేయర్‌తో జట్టును ఎంపిక చేశారు. వీరికి జూన్-జులైలో రెండువారాల కోచింగ్ కమ్ ట్రయల్స్ నిర్వహించబడ్డాయి. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా భారత బృందం హాంగ్‌జౌలో అడుగుపెట్టనుంది. ఆసియా క్రీడల్లో భారత మహిళల సాఫ్ట్‌బాల్ జట్టు పాల్గొనడం ద్వారా సత్తా చాటేందుకు మన క్రీడాకారిణులకు మంచి అవకాశమని ఎస్‌బిఎఐ ప్రెసిడెంట్ నీతల్ నారంగ్ అన్నారు.
జట్టు: ఐశ్వర్య రమేష్ పూరి, ఐశ్వర్య సునీల్ బోడ్కే, మోనాలీ మాన్సింగ్, స్వప్నాలి, సయీ జోషి, అంజలి, స్టెఫీసాజి, రింటా చెరియన్, మమతా గగులోత్, గంగా సోనా, మమతా మిన్హాస్, సందీప్ కౌర్, సన్పాల్ మనీషా, మనీషా హెల్ (స్టాండ్ బై), మనీషా కుమారి, ప్రీతివర్మ, చిత్ర (రిజర్వు ఆటగాళ్లు).