Saturday, September 21, 2024

Smart Exclusive – కలగంటినే చెలి! డ్రీమ్‌ ప్రపోజల్

ప్రేమ‌న‌గ‌రిలో గ్రేట్ స‌ర్‌ప్రైజ్‌
పారిస్ ఒలింపిక్స్‌ వేదిక‌గా ల‌వ్ ప్ర‌పోజ‌ల్‌
ఈ మూమెంట్‌ కోసం తొమ్మిదేళ్ల నిరీక్షణ
ప్రేయసికి ఒలింపిక్ ప్లేయర్ మ‌రిచిపోలేని కానుక‌
అరుదైన అవ‌కాశంతో మురిసిపోతున్న ప్రియురాలు
నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియో

సాధారణంగా ప్రేమలో ఉన్న ప్రతీ జంట తమ లైఫ్‌లో ఓ డ్రీమీ ప్రపోజల్ ఉంటే బాగుంటుంది అనుకుంటారు. ప్రియుడు కానీ, ప్రేయసి ఇలా ఎవ్వరో ఒకరు తమ అభిరుచులు, సౌకర్యానికి తగ్గట్లుగా ఈవెంట్‌ను ప్లాన్ చేసుకుని అవ‌త‌లి వారికి సర్‌ప్రైజ్ ఇస్తుంటారు. లైఫ్‌టైమ్ మెమరీలను క్రియేట్ చేస్తుంటారు. అయితే.. ఓ క్రీడాకారుడు మాత్రం తనకిష్టమైన ప్రదేశంలో ప్రేయసికి ప్రపోజ్ చేసేందుకు దాదాపు తొమ్మిదేళ్ల‌పాటు వెయిట్ చేశాడు. లేటెస్టుటా ఆ మూమెంట్‌ను నిజం చేసి నెట్టింట వైరలయ్యాడు. ప్రేమకు నెలవైన పారిస్‌లో ఆ డ్రీమీ ప్రపోజల్ ఎలా సాగిందో చ‌దివి తెలుసుకుందాం..

ఆ ఈవెంట్‌లోనే చూపులు కలిశాయి

- Advertisement -

అర్జెంటీనాకు చెందిన హ్యాండ్‌బాల్‌ స్టార్ పాబ్లో సిమోనెట్‌, మహిళల ఫీల్డ్‌ హాకీ క్రీడాకారిణి మరియా పిలార్‌ కామ్‌పోయ్‌ లవ్‌ స్టోరీ దాదాపు తొమ్మిదేండ్ల‌ క్రితం మొదలైంది. 2015లో ఓ స్పోర్ట్స్ ఈవెంట్‌లో ఈ ఇద్దరూ తొలిసారి కలుసుకున్నారు. తొలి చూపులోనే ప్రేమలో పడ్డారు. నెమ్మదిగా వీళ్ల స్నేహం కాస్త ప్రేమబంధంగా మారింది. అయితే.. కొంతకాలం తర్వాత తమ ప్రేమను సోషల్ మీడియా వేదికగా ఈ జంట‌ రివీల్ చేసింది. ఇక‌.. 2016 రియో ఒలింపిక్స్‌లో తమ తమ క్రీడల్లో పాల్గొని ఇద్ద‌రూ సత్తా చాటారు.

ఈ వార్తను చదవండి – మ‌ను బాక‌ర్ సంచ‌ల‌నం.. షూటింగ్ లో మ‌రో ర‌జితం

https://www.prabhanews.com/sports/paris-olympics-manu-bakar-gets-another-medal/

ప్రేమ‌న‌గ‌రిలో ఉప్పొంగిన ఉత్సాహం..
ఆ తర్వాత ఇప్పుడు ఈ జంటకు పారిస్‌ ఒలింపిక్స్‌లో మరోసారి కలిసి పాల్గొనే అవకాశం దక్కింది. దీంతో ప్రేమకు చిహ్నమైన ఈ నగరంలో ప్రేయసికి తన మనసులోని ప్రేమను తెలపాలనుకున్నాడు. అయితే ఈ క్షణం కోసం అతడు ఏకంగా తొమ్మిదేళ్ల పాటు ఎదురుచూశాడు. ఇటీవలే ఆ కల నిజమవ్వడంతో స్పోర్ట్స్ ప‌ర్స‌న్ అయిన మ‌న హీరో ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నాడు. ప్రపోజల్ అందుకున్న హీరోయిన్ కూడా సంతోంషంతో ఉప్పొంగిపోతోంది. త‌న‌కు ద‌క్కిన ఈ అరుదైన అవ‌కాశంతో మురిసిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement