గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభమన్ గిల్ కు 24 లక్షల ఫైన్ వేశారు. నెమ్మదిగా బౌలింగ్ చేయడం వల్ల ఆ జరిమానా పడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో జీటీ స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసింది. స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేయడం ఆ జట్టుకు ఈ సీజన్లో ఇది రెండోసారి..
- Advertisement -
కెప్టెన్‌తో పాటు 11 మంది ప్లేయర్లకు కూడా ఫైన్ వేశారు. వీరితో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ కూడా ఉన్నాడు. 11 మంది క్రికెటర్లకు ఆరు లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం ఫైన్ వేస్తారు. దీంట్లో ఏది తక్కువగా ఉంటే దాన్ని వసూల్ చేస్తారు.