Tuesday, September 17, 2024

SL vs NEP | శ్రీలంకను ముంచేసిన వ‌ర్షం..

టీ20 వరల్డ్ కప్‌-2024లో భాగంగా ఫ్లోరిడా వేదికగా నేడు జరగాల్సిన శ్రీలంక-నేపాల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వరుణుడు ప్రతాపానికి కనీసం టాస్ కూడా పడలేదు. మ్యాచ్‌ను కనీసం ఐదు ఓవర్ల మ్యాచ్ అయినా నిర్వహించాలనుకున్నా పరిస్థితులు అనుకూలించలేదు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ అందిస్తూ మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు.

అయితే, సూపర్-8‌కు చేరుకోవాలనుకున్న లంక ఆశలకు వరుణుడు నీళ్లు చెల్లాడు. గ్రూప్-డీలో ఉన్న లంక అంతకుముందు ఆడిన రెండు మ్యాచుల్లో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. ఇక లీగ్ స్టేజ్‌లో నెదర్లాండ్స్‌తో శ్రీలంక తమ చివరి మ్యాచ్‌ ఆడనుంది. ఈ పోరులో గెలిస్తే గరిష్టంగా మూడు పాయింట్లతో లీగ్ దశను ముగిస్తుంది.

ఇప్పటికే గ్రూప్-డీలో దక్షిణాఫ్రికా 6, బంగ్లాదేశ్ 2, నెదర్లాండ్స్ 2 పాయింట్లు సాధించాయి. అంతేగాక బంగ్లాదేశ్ వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచినా శ్రీలంక పాయింట్లను అధిగమించి కనిష్ఠంగా నాలుగు పాయింట్లతో బంగ్లాదేశ్ లేదా నెదర్లాండ్స్ లీగ్ దశను ముగిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement