Wednesday, July 3, 2024

ICC జట్టులో ఆరుగురు ఇండియ‌న్స్… కోహ్లికి నో ఛాన్స్

టీ20 ప్రపంచ కప్‌ 2024 ముగిసింది. లీగ్ దశ నుంచి ఓటమి ఎరగకుండా వరుస విజయాలు సాధించిన టీమ్‌ఇండియా ఫైనల్ వరకు అదే దూకుడు కొనసాగించి విశ్వవిజేతగా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌ ముగియడంతో ఈ ప్రపంచకప్‌లో అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించిన ఆటగాళ్లతో ఐసీసీ జట్టును ప్రకటించింది. కాగా, ఐసీసీ ప్రకటించిన ఈ జట్టు ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లకు చోటు దక్కింది.

భారత్‌ నుంచి రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్దిక్ పాండ్య, అర్ష్‌దీప్‌ సింగ్, అక్షర్‌ పటేల్‌ ఐసీసీ టీమ్‌కు ఎంపికయ్యారు. ఫైనల్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన విరాట్ కోహ్లీని ఈ టీమ్‌లోకి తీసుకోలేదు. అతడు టోర్నీలో వరుస మ్యాచ్‌ల్లో విఫలమైనా.. టైటిల్‌ పోరులో అదరగొట్టాడు. ఇక‌ ఆసక్తికర విషయం ఏంటంటే ప్రపంచ కప్‌ రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టు నుంచి ఒక్కరికి కూడా ఇందులో చోటు దక్కలేదు. ఐసీసీ జట్టులో 12వ ఆటగాడిగా దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోకియాను తీసుకున్నారు.

ఐసీసీ టీమ్‌ ఆఫ్‌ ది టీ20 వరల్డ్ కప్ 2024 …

  • రోహిత్ శర్మ- పరుగులు: 257, సగటు: 36.71, స్ట్రైక్ రేట్: 156.7, అర్ధశతకాలు: 3
  • రహ్మానుల్లా గుర్బాజ్ – పరుగులు: 281, సగటు: 35.12, స్ట్రైక్-రేట్: 124.33, అర్ధశతకాలు: 3
  • నికోలస్ పూరన్ – పరుగులు: 228, సగటు: 38.0, స్ట్రైక్-రేట్: 146.15, అర్ధశతకాలు: 1
  • సూర్యకుమార్ యాదవ్ – పరుగులు: 199, సగటు: 28.42, స్ట్రైక్-రేట్: 135.37, అర్ధశతకాలు: 2
  • మార్కస్ స్టాయినిస్- పరుగులు: 169, స్ట్రైక్-రేట్: 164.07, వికెట్లు: 10, ఎకానమీ: 8.88
  • హార్దిక్ పాండ్య- పరుగులు: 144, స్ట్రైక్-రేట్: 151.57, వికెట్లు: 11, ఎకానమీ: 7.64
  • అక్షర్ పటేల్ – పరుగులు: 92, స్ట్రైక్-రేట్: 139.39, వికెట్లు: 9, ఎకానమీ: 7.86
  • రషీద్ ఖాన్- వికెట్లు: 14, సగటు: 12.78, ఎకానమీ: 6.17, అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన: 4/17
  • జస్‌ప్రీత్‌ బుమ్రా – వికెట్లు: 15, సగటు: 8.26, ఎకానమీ: 4.17, అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన: 3/7
  • అర్ష్‌దీప్ సింగ్ – వికెట్లు: 17, సగటు: 12.64, ఎకానమీ: 7.16, అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన: 4/9
  • ఫజల్‌ హక్ ఫారూఖీ – వికెట్లు: 17, సగటు: 9.41, ఎకానమీ: 6.31, అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన: 5/9
  • అన్రిచ్ నోకియా (12వ ఆటగాడు) – వికెట్లు: 15, సగటు: 13.4, ఎకానమీ: 5.74, అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన: 4/7
Advertisement

తాజా వార్తలు

Advertisement