టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ కు ఐసీసీ షాకిచ్చింది. రెండో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ తో వాగ్వాదానికి దిగి మ్యాచ్‌లో దురుసుగా ప్రవర్తించినందుకు భారీ జరిమానా విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలో ప్రకారం సిరాజ్ ఆర్టికల్ 2.5ను ఉల్లంఘించాడని నిర్ధారించిన ఐసీసీ.. అతని మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధించింది.
మరోవైపు ఇదే టెస్టులో హెడ్ కూడా ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఐసీసీ నిర్ధారించింది. అతను ఆర్టికల్ 2.13ని ఉల్లంఘించినట్లు వెల్లడించిన ఐసీసీ.. అతనికి ఒక్క డీమెరింట్ పాయింట్ మాత్రమే శిక్ష విధించింది. గత రెండు సంవత్సరాల్లో ఇది మొదటి తప్పుగా భావించిన ఐసీసీ ఈ శిక్షతో సరిపెట్టింది.