Saturday, November 23, 2024

సిరాజ్‌ స్పెల్‌ అద్భుతం.. జహీర్​ఖాన్​ ప్రశంసలు..

ముంబై: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా పేసర్‌ సిరాజ్‌ బౌలింగ్‌ స్పెల్‌ అద్భుతమని భారత పేస్‌ దిగ్గజం జహీర్‌ఖాన్‌ ప్రశంసించాడు. సీనియర్‌ పేసర్‌ ఇషాంత్‌శర్మ గాయపడటంతో అతడి స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకున్న సిరాజ్‌ గేమ్‌ ఛేంజింగ్‌ స్పెల్‌తో మెరిశాడని ప్రశంసించాడు. కొత్తబంతితో చెలరేగిపోయిన సిరాజ్‌ తన బౌలింగ్‌లో విల్‌యంగ్‌, టామ్‌ లాథమ్‌, రాస్‌ టేలర్‌ను పెవిలియన్‌కు పంపి న్యూజిలాండ్‌ను కోలకుకోలేని దెబ్బ తీశాడు. దీంతో కివీస్‌ కోలుకోలేకపోయింది. 62పరుగులకే న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది.

భారత్‌ సొంతగడ్డపై న్యూజిలాండ్‌కు ఇదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. భారత్‌ 372పరుగులు భారీ తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించడంలో సిరాజ్‌ కూడా కీలకపాత్ర పోషించాడని జహీర్‌ పేర్కొన్నాడు. స్పిన్నర్లుకు అనుకూలిస్తున్న పిచ్‌పై పేసర్‌ సిరాజ్‌ రాణించి 3వికెట్లు తీయడం టీమిండియా విజయానికి దోహదపడిందని తెలిపాడు. అదేవిధంగా మయాంక్‌ అగర్వాల్‌ 150పరుగులతో తొలి ఇన్నింగ్స్‌లో రాణించడాన్ని భారత మాజీలెఎn్టార్మ్‌ పేసర్‌ జహీర్‌ఖాన్‌ ప్రశంసించాడు. కాన్పూర్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు డ్రా అయిన సంగతి తెలిసిందే. అనంతరం ముంబై టెస్టును భారత్‌ 372పరుగులు భారీ తేడాతో నాలుగురోజుల్లోనే ముగించి సిరీస్‌ను కైవసం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement