వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల విభాగం సింగిల్స్‌లో టాప్ సీడ్ జన్నిక్ సిన్నర్, మూడో సీడ్ కార్లోస్ అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్ల్లోకి దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్ ప్రి క్వార్టర్స్‌లో ఏడో సీడ్ పౌలినీ అమెరికా స్టార్ మాడిసన్ కీస్‌పై విజయం సాధించింది.
ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రి క్వార్టర్ ఫైనల్స్‌లో స్పెయిన్ యువ కిరీటం, ప్రపంచ మూడో ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ 6-3, 6-4, 1-6, 7-5 తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన 16వ సీడ్ యుగో హంబర్ట్‌ను ఓడించి నాకౌట్ బెర్త్ సొంతం చేసుకున్నాడు.
మరో మ్యాచ్‌లో టాప్ సీడ్ జెన్నిక్ సిన్నర్ (ఇటలీ) 6-2, 6-4, 7-6 (11-9) తేడాతో 14వ సీడ్ బెన్ షెల్టన్ (అమెరికా)ను ఓడించి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు.
మరోవైపు మహిళల సింగిల్స్‌లో 7వ సీడ్ ఇటలీ స్టార్ క్రీడాకారిణి జాస్మిన్ పౌలినీ కూడా క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశించింది. మాడిసన్ కీస్ (అమెరికా)-పౌలినీ (ఇటలీ) మధ్య జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో కీస్ ఆట మధ్యలోనే గాయంతో తప్పుకుంది.