ఫ్రెంచ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత సీనియర్ షట్లర్లు పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ముందంజ వేశారు. మహిళల సింగిల్స్‌లో సింధు 20-22,22-20, 21-19తో మిచెల్లీ లీ(కెనడా)పై అద్భుత విజయం సాధించింది. గంటా 20నిమిషాల పాటు జరిగిన పోరులో సింధు అద్భుత పోరాటపటిమ కనబరిచింది.
- Advertisement -
గాయం నుంచి తేరుకున్న తర్వాత పోటీపడుతున్న రెండో టోర్నీలో సింధు సత్తాచాటింది. తొలి గేమ్‌ను ప్రత్యర్థికి చేజార్చుకున్న ఈ తెలుగు షట్లర్ వరుస గేముల్లో లీని చిత్తు చేసింది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్..21-15, 20-22, 21-8తో చౌ తీన్(చైనీస్ తైపీ)పై గెలిచి రెండో గేమ్‌లోకి దూసుకెళ్లాడు. మరో సింగిల్స్ తొలి రౌండ్లో హెచ్ఎస్ ప్రణయ్..17-21, 17-21తో లు గువాంగ్ జు(చైనా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.