భారత్ స్టార్ షట్లర్ పీవీ సింధు తన అద్భుతమైన ఆటతో మలేషియా మాస్టర్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో థాయ్‌లాండ్ ప్లేయర్ బుసానన్ ఆంగ్‌బామ్‌రుంగపాన్‌పై 13-21, 21-16, 21-12 స్కోరుతో విజయం సాధించింది. ఈ ఏడాదిలో బ్యాడ్మింటన్ టోర్నీలో ఫైనల్లోకి సింధు ప్రవేశించడం ఇదే తొలిసారి. కాగా, ఫైనల్స్ లో చైనాకు చెందిన వాంగ్ ఝి యీతో తలపడనుంది.
సైనా నెహ్వాల్ రికార్డు బ్రేక్..
సింధు సాధించిన గెలుపు తన కెరీర్‌లో 452వ విజయం. ఈ తరుణంలో భారత బ్యాడ్మింటన్ చరిత్రలో సింగిల్స్‌లో అత్యధిక విజయాలు సాధించిన షట్లర్‌గా ఉన్న సైనా నెహ్వాల్ (451) రికార్డును సింధు అధిగమించింది.