పారిస్ వేదికగా జరుగుతున్న ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్ విభాగంలో చైనాకు చెందిన లీ షిఫెంగ్‌తో తలపడిన భారత ఆటగాడు లక్ష్య సేన్ 21-16, 15-21, 13-21 పాయింట్ల తేడాతో గెలుపొందాడు. ఇక ఇవ్వాల జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో సింగపూర్‌కు చెందిన లోహ్ కీన్ యూతో తలపడనున్నాడు.
మరోవైపు పురుషుల డబుల్స్‌లో భారత ఏస్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి క్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. ప్రిక్వార్టర్స్‌లో భారత జోడీ 21-13, 21-12తో మలేషియాకు చెందిన మన్ వీ చోంగ్, కై వూ టీపై వరుస సెట్లలో విజయం సాధించి క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. క్వార్టర్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన సుపక్ జోమ్‌కో, కిట్టినుపాంగ్ కేడ్రెన్‌తో పోటీపడనున్నాడు.
క్వార్టర్స్‌లో సింధు ఓటమి !
నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్‌లో పీవీ సింధు చైనాకు చెందిన చెన్ యుఫీతో తలపడింది. తొలి సెట్‌లో విజయం సాధించిన భారత షట్లర్.. ఆ తరువాత రెండు సెట్లలో ఓడి టోర్నీ నుంచి వైదొలిగింది. చెన్ యుఫీతో 24-22, 17-21, 18-21తో సింధు ని చిత్తు చేసింది.
ఇక, మహిళల డబుల్స్‌లోనూ ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్‌లు క్వార్టర్స్‌కు చేరుకున్నారు. ప్రీక్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన యుకీ ఫుకుషిమా, సయాకా హిరోటా జంటను 18–21, 13–21తో వరుస సెట్లలో ఓడించిన భారత మహిళల జోడీ క్వార్టర్స్‌లో చైనా జోడీ చెన్-జియాతో పోటీపడనుంది.