Thursday, November 21, 2024

Japan Masters | సింధు శుభారంభం !

జపాన్‌ మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు లభించాయి. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌లో భారత స్టార్‌ రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు అలవోకగా విజయం సాధించి రెండో రౌండ్‌లో ప్రవేశించింది. థైలాండ్‌ స్టార్‌ 8వ సీడ్‌ బుసానన్‌ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌ను 21-12, 21-8 తేడాతో వరుస గేముల్లో చిత్తు చేసి టోర్నీలో శుభారంభం చేసింది. ఈ మ్యాచ్‌ను సింధు కేవలం 38 నిమిషాల్లోనే ముగించేసింది.

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో మాత్రం భారత్‌కు నిరాశే మిగిలింది. స్టార్‌ యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ తొలి రౌండ్‌లో పోరాడి ఓడాడు. బుధవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో లక్ష్యసేన్‌ 22-20, 17-21, 16-21 తేడాతో లియోంగ్‌ జున్‌ హవో (మలేషియా) చేతిలో పోరాడి ఓడాడు.

ఇక అంతకుముందు జరిగిన మహిళల డబుల్స్‌లో భారత స్టార్‌ జోడీ గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ కూడా తొలి రౌండ్‌లోనే పరాజయంతో టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement